హైదరాబాద్ టు బెంగళూరు ప్రయాణీకులకు బిగ్ అప్డేట్, కీలక మార్పు..!!

హైదరాబాద్‌- బెంగళూరు ప్రయాణీకులకు బిగ్ అప్డేట్. ఈ మార్గంలో ప్రయాణం ఇక మరింత సులభంగా.. వేగంగా వెళ్లేందుకు వీలుగా కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఈ రహదారి విస్తరణకు ఆమోదం లభించింది. ప్రస్తుతమున్న 176.37 కిలోమీటర్ల 4 వరుసల రహదారిని 6 లేన్ల పాక్షిక యాక్సెస్‌ కంట్రోల్డ్‌ హైవేగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. ఇందు కోసం దాదాపు రూ 5 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.

హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌- 44) విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మార్గంలో హైదరాబాద్‌ నుంచి కర్నూలు వరకు ప్రస్తుతమున్న 176.37 కిలోమీటర్ల 4 వరుస ల రహదారిని 6 లేన్ల పాక్షిక యాక్సెస్‌ కంట్రోల్డ్‌ హైవేగా అభివృద్ధి చేసేలా అలైన్‌మెంట్‌ను రూపొందించి కేంద్రానికి పంపింది. రూ. 5 వేల కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో బ్రౌన్‌ ఫీల్డ్‌ (ప్రస్తుత రోడ్డునే అభివృద్ధి, విస్తరణ చేయడం) విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. తెలంగాణ పరిధిలో ఈ మార్గం కొత్తూరు, షాద్‌నగర్‌, బాలానగర్‌, జడ్చర్ల, భూత్పూర్‌, అన్నాసాగర్‌, జానంపేట, మూసాపేట, అడ్డాకల్‌, కనిమెట్ల, బీచుపల్లి, పుల్లూర్‌ మీదుగా కర్నూలుకు చేరుకుంటుంది.

 శ్రీవారి భక్తులకు కొత్తగా భారీ వసతి సముదాయం, ఇక వీరికి అక్కడే కేటాయింపు- కీలక మార్పు..!!
శ్రీవారి భక్తులకు కొత్తగా భారీ వసతి సముదాయం, ఇక వీరికి అక్కడే కేటాయింపు- కీలక మార్పు..!!
centre-plans-new-hyderabad-bengaluru-high-speed-six-lane-greenfield-highway-here-the-details

తాజా నిర్ణయం.. కొత్త ప్రణాళికలతో

ఈ మార్గంలో మొత్తం రహదారిపై 3 చోట్ల టోల్‌ ప్లాజాలు, 8 మేజర్‌, 62 మైనర్‌ జంక్షన్లతో పాటు 10 మేజర్‌, 74 మైనర్‌ బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంది. మొత్తం 86 అండర్‌ పాస్‌లు ఏర్పాటు కానున్నాయి. ఈ మార్గంలో ఏర్పాటు చేయబోయే 3 టోల్‌ప్లాజాల్లోనూ.. ప్రయాణించిన దూరం మాత్రమే రుసుము చెల్లించేలా కొత్త సాంకేతికతను వినియోగించనున్నారు. వాహనం హైవే పైకి ఎక్కిన చోట, దిగిన చోట ఉండే ఆటోమేటిక్‌ స్కానర్లు ప్రయాణించిన దూరాన్ని లెక్కించి నేరుగా ఫాస్టాగ్‌ నుంచి రుసుమును మినహాయించుకుంటాయి. ప్రస్తుత రహదారిపై గంటకు 80 కిలో మీటర్ల వేగానికి అనుమతి ఉండగా.. విస్తరణ అనంతరం వాహనాలు గంటకు 100-120 కి.మీ వేగంతో ప్రయాణించేందుకు వీలవుతుంది. హైదరాబాద్‌- బెంగళూరు మధ్య ప్రయాణ సమయం ప్రస్తుతం 8-10 గంటల వరకు ఉండగా.. ఇక నుంచి 4 నుంచి 5 గంటల సమయంలో పూర్తి చేసే అవకాశం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+