ఊపిరి ఆపేసే గ్లింప్స్ వచ్చేసింది.. వణికిస్తున్న హారర్ థ్రిల్లర్..!
హారర్ థ్రిల్లర్ మూవీస్ కు ఎప్పుడూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హారర్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్లర్ మూవీస్ సాధారణంగా తెలుగులో చాలా తక్కువగా వస్తుంటాయి. కానీ మలయాళంలో మాత్రం ఇలాంటి సినిమాలు వరుసబెట్టి వస్తుంటాయి. అదేంటో గానీ మలయాళం నుంచి వచ్చే ప్రతి హారర్, థ్రిల్లర్ మూవీస్ ఏమాత్రం బోర్ కొట్టకుండా ఉంటాయి. ఓటీటీలు వచ్చాక ఇతర భాషల సినిమాలు తెలుగు ప్రేక్షకులు చూడడం ఎక్కువై పోయింది.
అయితే త్వరలో తెలుగులో మరో హారర్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. గతేడాది చివర్లో శంభాల, ఈషా లాంటి మూవీస్ ప్రేక్షకుల్ని అలరించిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు, సీనియర్ నటి లయ ప్రధాన పాత్రలుగా ఓ సినిమా రాబోతుంది. ఈ మూవీకి 'వదలా' అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ చాలా ఆసక్తికరంగా ఉంది. జగపతి బాబు, లయ చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు.
ఈ 'వదలా' మూవీలో ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాస్ కీలక పాత్ర పోషించింది. గ్లింప్స్ చూస్తుంటే.. జగపతి బాబు కుటుంబంలోని ప్రతీ ఒక్కరిని హ్రితిక శ్రీనివాస్ చంపేస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ గ్లింప్స్ చూస్తుంటే కచ్చితంగా ఇది థియేట్రికల్ అనుభూతి చెందాల్సిన సినిమానే అని అర్థం అవుతోంది.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఉత్కంఠ భరితంగా ఉంది. ఈ మూవీని ప్రముఖ నిర్మాత తమ్మా రెడ్డి భరద్వాజ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆకెళ్ల కృష్ణ తెరకెక్కించారు. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. ఇక గతంలో జగపతి బాబు, లయ కాంబోలో మనోహరం, నాలో ఉన్న ప్రేమ, హనుమాన్ జంక్షన్ , శివ రామ రాజు వంటి చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications