స్విగ్గీ, జొమాటో బంద్ ..! ఏపీలో హోటల్స్ సంచలన నిర్ణయాలు..!

ఇరాన్ యుద్దం కారణంగా ఎల్పీజీ (LPG Crisis) కొరత ఏర్పడటంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో హోటళ్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇదే క్రమంలో ఏపీలోనూ హోటల్స్ పై ఎల్పీజీ కొరత ప్రభావం పడింది. రోజురోజుకీ గ్యాస్ కొరత తీవ్రమవుతుండటంతో ఇవాళ విజయవాడలో సమావేశమైన ఏపీ హోటల్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో ఎల్బీజీ కొరతను అంచనా వేశాక ఈ నిర్ణయాలు ప్రకటించింది.

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కమర్షియల్‌ గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్‌ హోటల్స్‌ అసోసియేషన్‌.... స్టార్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసరంగా విజయవాడలో సమావేశమయ్యాయి. గ్యాస్‌ కొరతతో పాటు పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల పట్ల హోటల్‌ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోతే హోటళ్లను ఎంతకాలం మూసి ఉంచాల్సి వస్తుందనే అంశంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. రేపటి నుంచే గ్యాస్‌ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని, అందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అసోసియేషన్ నిర్ణయించింది.

LPG Crisis AP Hoteliers Association Boycotts Swiggy Zomato Deliveries in next two days

గ్యాస్‌ పొదుపు చర్యల్లో భాగంగా స్టార్‌ హోటళ్లలో జుమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్‌ ఆర్డర్లను త్వరలోనే నిలిపివేస్తామని అసోసియేషన్‌ ప్రతినిధులు స్పష్టం చేశారు. గ్యాస్‌ ఆదా చేసేందుకు ప్రతి సోమవారం రెస్టారెంట్లను పూర్తిగా మూసివేసి, 'వీక్లీ హాలిడే' ప్రకటించనున్నారు. దీనివల్ల కొంతవరకు గ్యాస్‌ ఆదా అవుతుందని భావిస్తున్నారు. అలాగే కర్ణాటక తరహాలో ఏపీలోనూ కొన్ని హోటల్స్ కేవలం టీ, కాఫీలు మాత్రమే విక్రయించే పరిస్థితి రానుందన్నారు. రాత్రి 10 గంటల వరకే రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లను నడిపేలా సమయం కుదించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

LPG Crisis AP Hoteliers Association Boycotts Swiggy Zomato Deliveries in next two days

బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను ఏర్పాటు చేయాలని, డొమెస్టిక్‌ గ్యాస్‌ మాదిరిగానే కమర్షియల్‌ గ్యాస్‌ను కూడా సరఫరా చేయాలని హోటల్స్ కోరాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు, మంత్రి నాదెండ్ల మనోహర్‌లను కలిసి వినతిపత్రాలు అందజేస్తామన్నారు. ఆతిథ్య రంగంపై ఆధారపడిన వేల మంది కార్మికులు వీధిన పడకుండా చూడాలని, హాస్పిటాలిటీ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+