T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..!
స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ (T20 World cup 2026)లో అసాధారణ విజయాలతో భారత్ ను టైటిల్ విజేతగా నిలిపిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కు 48 గంటల్లోనే ఐసీసీ (ICC)అనూహ్య షాక్ ఇచ్చింది. తన నాయకత్వ ప్రతిభతో టీమిండియాకు స్వదేశంలో తొలిసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ లభించడంలో కీలక పాత్ర పోషించిన సూర్య కుమార్ యాదవ్ (suryakumar yadav)పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇలాంటి సమయంలో జైషా నేతృత్వంలోని ఐసీసీ మాత్రం భారీ షాక్ ఇచ్చి అభిమానుల్ని సైతం నిరాశపరిచింది.
ఐసీసీ తాజాగా టీ20 ప్రపంచ కప్ 2026 టీం ఆఫ్ ది టోర్నమెంట్ ను ప్రకటించింది. ఇందులో టోర్నీ ఆద్యంతం మెరుగైన ప్రతిభ చూపిన క్రికెటర్లకు చోటు కల్పించింది. ఎప్పటిలాగే ఫైనల్ ముగిసిన ఒక రోజు తర్వాత టోర్నమెంట్ టీం ఆఫ్ ది టోర్నమెంట్‌ను విడుదల చేసింది. ఇందులో నలుగురు భారతీయులకు చోటు దక్కింది. అయితే ఇందులో సూర్యకుమార్ మాత్రం లేదు.
ఐసీసీ ప్రకటించిన ఈ వరల్డ్ కప్ జట్టుకు దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఐడెన్ మార్ క్రమ్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు.

దిగ్గజ క్రికెటర్ ఇయాన్ బిషప్, నటాలీ జెర్మనోస్, బ్రాడ్ కాస్టర్ ఇయోన్ మోర్గాన్, ఐసీసీ ప్రతినిధి గౌరవ్ సక్సేనా స్పోర్ట్స్ జర్నలిస్ట్ రెక్స్ క్లెమెంటైన్ ఈ జట్టును ఎంపిక చేశారు. అయితే ఈ జట్టులో సూర్య కుమార్ యాదవ్ కు చోటు దక్కకపోవడానికి ప్రధాన కారణం కెప్టెన్సీలో మెరుగ్గానే ఉన్నా సొంత ఆటతీరులో మాత్రం ఆతను విఫలం కావడమే కారణంగా తెలుస్తోంది. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ పతనం నుంచి సూర్యకుమార్ అజేయంగ 84 పరుగులు చేసి భారత్‌ను కాపాడాడు. కానీ తర్వాతి మ్యాచ్‌లలో మాత్రం 12, 32, 34, 18, 33, 18, 11, 0 స్కోర్లు చేశాడు.

ఈ వరల్డ్ కప్ టీమ్ ఎలెవన్ లో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్, భారత వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ సంజూ శ్యాంసన్, మరో స్టార్ ఆటగాడు ఇషాన్ కిషన్, దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్ క్రమ్, భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ విల్ జేక్స్, విండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్, భారత పేసర్ జస్ ప్రీత్ బుమ్రా, దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి, ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్, జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ, 12వ ఆటగాడిగా షాడ్లే వాన్ షాల్విక్ ఎంపికయ్యారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications