మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!

2026- 27 పరాభవ నామ సంవత్సర తెలుగు సంవత్సరంలో మిధున రాశి వారి జాతకం ఏ విధంగా ఉంది? మిధున రాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుందా లేదా? వంటి అనేక వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం. మిధున రాశి జాతకులకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.

మిధునరాశి ఆదాయ వ్యయాలు ఇలా

ఈ సంవత్సరం ఆదాయం 8 కాగా వ్యయం-11 గా ఉంటుంది. రాజపూజ్యం ఒకటిగా అవమానం 7 గా ఉంటుంది. ఈ సంవత్సరం మిధున రాశి వారికి కుటుంబ కారకుడైన గురుడు తో పాటు శని కుజుడు రాహువులు బలమైన స్థలాలలో ఉండడం వల్ల విశేష యోగాలు రాబోతున్నాయి.

Gemini 2026-2027 Horoscope Income Career education And Family Outlook from parabhava nama ugadi

ఆర్థిక స్థితి

ఈ సంవత్సరం మిధున రాశి వారి ఆదాయం బాగుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి చేపట్టే ఏ పనైనా విజయం సాధిస్తుంది. మిధున రాశి వారికి వర్తక వ్యాపారాలలో కలిసి వస్తుంది. కొత్త ఇంటి కోసం ఎదురు చూస్తున్న వారి ఇంటి కల ఈ సంవత్సరం నెరవేరుతుంది. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు చేసే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలను సందర్శించడంతో పాటు, కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది.

ఉద్యోగులకు

పరాభవ నామ సంవత్సరం మిధున రాశి ఉద్యోగులకు అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి.

వ్యాపారం

మిధున రాశి వారికి ఈ సంవత్సరం వ్యాపారం చేసే వారికి యోగ కాలంగా చెప్పవచ్చు. సంపద గణనీయంగా పెరుగుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారాలతో మీకు కలిసి వస్తుంది. ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో కాంట్రాక్టర్లకు లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ది జరుగుతుంది

విద్యార్థులకు

మిధున రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. శ్రద్ధగా చదివి మంచి మార్కులు సాధిస్తారు. విదేశాలలో విద్యను అభ్యసించాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించి గుర్తింపు పొందుతారు. క్రీడాకారులు గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మెరుగైన విజయాలను సాధిస్తారు.

కుటుంబ స్థితి

ఈ సంవత్సరం మిధున రాశి వారి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. కుటుంబం కోసం ఈ సంవత్సరం ఎక్కువగా ఖర్చు పెడతారు. ఇది మిధున రాశి వారికి సంతోష కాలం. కుటుంబంతో ప్రేమను ఆస్వాదించే కాలం. ఇక మిధున రాశిలో ఉన్న స్త్రీలకు కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని విధాల శుభప్రదంగా ఉంటుంది.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+