Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Trump: "అంతా బూడిద చేశాం.. ఇక యుద్ధం ముగిస్తాం"

పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్త పరిస్థితులు, ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు యుద్ధం ఆగుతుందని అన్నారు. ఇరాన్‌ లో అన్ని లక్ష్యాలనూ ఛేదించినట్లు తెలిపారు. ఇరాన్‌ దగ్గర ఇంకేమీ మిగల్లేదని.. త్వరలో ఇరాన్‌ తో యుద్ధం ముగిస్తామని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇరాన్ లో దాడులు చేయడానికి ఇంకా ఏమీ మిగల లేదని అన్నారు. మరోవైపు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్​, ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మొజ్తబా ఖమేనీ యుద్ధం ప్రారంభంలోనే గాయాల పాలైనట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి.

ఇరాన్ తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ తో యుద్ధం త్వరలో ముగిస్తామని అన్నారు. అమెరికా- ఇజ్రాయెల్ సైనిక చర్య ద్వారా ఇరాన్ కు ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇరాన్ లో దాదాపు అన్ని లక్ష్యాలను ఛేదించామని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధి మూసి వేయడం ఇంకా అనేక కారణాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతున్న నేపథ్యంలో ట్రంప్ పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు. గతంలో ట్రంప్.. ఇరాన్ పై దాదాపు కొన్ని నెలల పాటు యుద్ధం చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

ఇక అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌ లోని చాలా లక్ష్యాలను ఇప్పటికే ధ్వంసం చేశాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ తో యుద్ధం ముగింపు ఇప్పుడు తన చేతిలోనే ఉందని.. తాను ఎప్పుడనుకుంటే అప్పుడు యుద్ధం క్లోజ్ చేస్తానని స్పష్టం చేశారు. ఇరాన్ కు ఆరు వారాల గడువు లోపు కూడా తాము ఊహించిన దాని కంటే ఎక్కువ నష్టం కలిగించినట్లు పేర్కొన్నారు. పశ్చిమాసియాలో దశాబ్దాలుగా నెలకున్న అస్థిరతకు ఇరాన్ కారణమని ట్రంప్ స్పష్టం చేశారు.

Trump Bold Iran War Claim War Ends When I Want All Objectives Achieved Says President trump

అయితే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ మాత్రం యుద్ధాన్ని కొనసాగిస్తామని వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయెల్ సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉందని ఆయన తాజాగా సంకేతాలిచ్చారు. ఈ యుద్ధం ఎటువంటి సమయ పరిమితి లేకుండా, అవసరమైనంత కాలం కొనసాగుతుంది. అన్ని లక్ష్యాలను సాధించి ఈ పోరాటంలో విజయం సాధించే వరకు ఇది ఆగదు అని కట్జ్ స్పష్టం చేశారు. దాంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఇరాన్ సైతం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. అమెరికా-ఇజ్రాయెల్ దాడులను ప్రతిఘటిస్తూనే ఉంటామని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+