AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..!

ఏపీలో భారీ ఎత్తున పెన్షన్లు (pensions) తొలగిస్తున్నారని, కొత్త పెన్షన్లు సైతం ఇవ్వడం లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం (ap govt) స్పందించింది. రాష్ట్రంలో పెన్షన్ల తొలగింపుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. ఏయే పెన్షన్లు తొలగిస్తున్నారో ఆయన వెల్లడించారు. అలాగే పెన్షన్ల కోసం బడ్జెట్ సరిపోకపోతే ఎక్కడి నుంచి నిధులు తెస్తున్నారో కూడా ఆయన ఓ ప్రకటనలో స్పష్టత ఇచ్చారు.

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం మృతిచెందిన, శాశ్వ‌తంగా వ‌ల‌స‌వెళ్లిన పెన్ష‌న్లు మాత్ర‌మే ర‌ద్ద‌య్యాయని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వైఎస్ జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. గ‌త వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వంలో ప్ర‌తి ఆరు నెల‌ల‌కు సిక్స్ స్టెప్ వ్యాలీడేష‌న్ పేరుతో 5 ఏళ్ల‌లో ఏకంగా 11 ల‌క్ష‌ల‌కు పైగా పెన్ష‌న్లు ర‌ద్దు చేసి పేద‌ల పొట్ట‌గొట్టారని ఆయన మండిపడ్డారు.

AP Govt Clarifies Pension Removal Allegation Details Exactly Which Pensions Were Cut

వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాల‌న కాలంలో ఇష్టం వ‌చ్చిన‌ట్టు పెన్ష‌న్లు తొల‌గించారని, ఆ విధంగా కూట‌మి ప్రభుత్వ, 20 నెల‌ల పాల‌న‌లో అన్యాయంగా ఒక్క పెన్ష‌న్ కూడా తొల‌గించ‌లేదని మంత్రి తెలిపారు. పేదలకు అన్యాయం చేసే ఉద్దేశం తమకు లేదని మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి, ప్రతీ నెలా స్పౌస్‌ పెన్షన్ కోటాలో వితంతువులకు పెన్షన్ మంజూరు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నెల నెలా స్పౌస్‌ పెన్షన్ లను మంజూరు చేస్తుంటే, ఏ ఒక్క పెన్షన్ మంజూరు చేయలేదని మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్ ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు.

AP Govt Clarifies Pension Removal Allegation Details Exactly Which Pensions Were Cut

గత ప్రభుత్వం 2021-24 మధ్య కాలంలో బేవరేజెస్ కార్పొరేషన్ నుండి ₹18,472.59 కోట్లు ఖర్చు చేసిందని తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్...కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రూ. 11 వేల 140.46 కోట్లు ఖర్చు చేసిందన్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ వారు ఇచ్చే నిధుల వివరాలు ప్రభుత్వ బడ్జెట్ లో చూపించడం లేదన్నారు. అలాగే సామాజిక భద్రతా పెన్షన్ ల కోసం 2026-27 ఆర్ధిక సంవత్సరంలో 27 వేల 719 కోట్ల రూపాయలను బడ్జెట్ లో ప్రతిపాదించామని, పెన్షన్ లకు కావాల్సిన మరో రూ.5 వేల 766 కోట్ల రూపాయలను బేవరేజెస్ కార్పోరేషన్ నుంచి తీసుకుంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+