విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!
రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల ప్రయాణీకుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. వందేభారత్ స్లీపర్ ను తాజాగా ప్రధాని మోదీ ప్రారంభించారు. గౌహతి- అస్సాం మధ్య తొలి సర్వీసు అందుబాటులోకి వచ్చింది. విమాన తరహా సౌకర్యాల తరహాలో ఉన్న ఈ రైలు పైన ప్రయాణీకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా, తెలుగు ప్రయాణీకుల కోసం తొలి విడత వందేభారత్ స్లీపర్ కేటాయింపుల్లో తిరుపతికి కొత్త సర్వీసుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి కొత్త ప్రతిపాదన పైనా కసరత్తు జరుగుతోంది.
వందేభారత్ స్లీపర్ రైళ్లు వరుసగా పట్టాలెక్కుతున్నాయి. తొలి విడతలో తొమ్మిది రైళ్లు పలు రాష్ట్రాలకు కేటాయింపు పైన తుది కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా తిరుపతికి ఒక రైలు కేటాయించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ, విజయవాడ నుంచి అయోధ్య, విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు పైన ప్రతిపాదనలు సిద్దంగా ఉన్నాయి. వీటిల్లో ముందుగా విశాఖ నుంచి బెంగళూరుకు వయా తిరుపతి మీదుగా వందేభారత్ కేటాయింపు కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ఉదయం సమయంలో రాకపోకలు సాగిస్తోంది. ఈ రైలుకు భారీగా డిమాండ్ ఉంటోంది. వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు పైన తెలుగు రాష్ట్రాల ఎంపీల నుంచి రైల్వే శాఖకు పలు ప్రతిపాదనలు అందాయి. అందులో భాగంగా విశాఖ నుంచి తిరుపతి, విశాఖ నుంచి బెంగళూరు కు వందేభారత్ స్లీపర్ కేటాయించాలని ఇప్పటికే ఎంపీలు నేరుగా రైల్వే మంత్రిని కలిసి వినతి పత్రాలు సమర్పించారు.

విశాఖ నుంచి బెంగళూరు వయా తిరుపతి మీదుగా
ఇక, విజయవాడ నుంచి బెంగళూరుకు తిరుపతి మీదుగా వందేభారత్ కు ఆమోదం వచ్చినా ఇంకా పట్టాలెక్కలేదు. ఇదే సమయంలో ఏపీ నుంచి అయోధ్య, వారణాసి కి వందేభారత్ స్లీపర్ కేటా యింపు లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని వినతులు అందాయి. కానీ, తాజాగా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ, అదే విధంగా విశాఖ నుంచి బెంగళూరుకు వయా తిరుపతి మీదుగా వందేభారత్ స్లీపర్ రైలు ఖాయమైనట్లు సమాచారం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసే లోగా ఈ రైలును అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ రైలులో కనీస ఛార్జి రూ.960 నుంచి ప్రారంభ ధరగా నిర్ణయించారు. ది. 400 కిలోమీటర్ల ప్రయాణానికి 3ఏసీ ప్రయాణానికి ఈ ఛార్జీ వర్తిస్తుంది. ఈ రైళ్లల్లో RAC సౌకర్యం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికుల కేవలం కన్ఫర్మ్ టికెట్లు మాత్రమే జారీ చేస్తారు. రైల్వే శాఖ ఈ రైలును అధికారికంగా ప్రకటిస్తే.. తిరుపతికి వెళ్లే ప్రయాణీకులకు వెసులుబాటు కలగనుంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications