రమ్యకృష్ణ ‘సెకండ్ లవ్’.. సీనియర్ నటి బోల్డ్ డెసిషన్‌కు ఫ్యాన్స్ షాక్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 'శివగామి' వంటి పవర్‌ఫుల్ పాత్రలతో మెప్పించిన రమ్యకృష్ణ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల హవా విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో రమ్యకృష్ణ కూడా ఓటీటీ బాట పట్టారు. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త వెబ్ సిరీస్ 'సెకండ్ లవ్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సీనియర్ నటీమణులు కూడా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో రమ్యకృష్ణ ఈ బోల్డ్ ప్రాజెక్టును ఎంచుకోవడం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా ఓటీటీల కోసం రూపొందే వెబ్ సిరీస్‌లలో లేదా నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలయ్యే సినిమాలలో చిన్న హీరోలు, వర్ధమాన నటీనటులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. స్టార్ హోదా ఉన్న అగ్రతారలు వెబ్ సిరీస్‌లు చేయడానికి అంతగా ఆసక్తి చూపించరు. కానీ ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. కథలో సత్తా ఉండి.. తమ పాత్రకు ప్రాధాన్యత ఉంటే చాలు వెబ్ సిరీస్‌లు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ క్రమంలో రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ ను మరింత క్రేజీగా మార్చుకుంటూ ఈ సరికొత్త వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యారు.

Ramya Krishna Second Love Web Series Senior Actress All Set For Her Bold OTT Debut Full Details

'సెకండ్ లవ్' అనే ఆసక్తికరమైన టైటిల్‌తో రాబోతున్న ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్'లో స్ట్రీమింగ్ కానుంది. టైటిల్‌ను బట్టే ఈ సిరీస్ పూర్తిగా ప్రేమ, ఆకర్షణ, వ్యామోహం అనే కాన్సెప్ట్ చుట్టూ తిరగనుందని స్పష్టమవుతోంది. ఇలాంటి ఓ విభిన్నమైన, కాస్త బోల్డ్ లైన్ ఉన్న కథాంశంలో రమ్యకృష్ణ నటించడం అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సిరీస్‌కు సంబంధించిన అధికారిక స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. వెండితెరపై తన నటనతో మెప్పించిన రమ్యకృష్ణ, ఈ ఓటీటీ సిరీస్‌లో ఎలాంటి సరికొత్త నటనతో అలరిస్తుందో చూడాలని అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+