రామ్ చరణ్ పెద్ది రీ లోడెడ్.. కొత్తగా మరో 6 నిమిషాల సీన్స్ !!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం "పెద్ది". 'ఉప్పెన' మూవీ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు విజువల్స్ సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్త సమర్పణలో.. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ మూవీని నిర్మించారు.
ఒక గ్రామం ఆత్మగౌరవ పోరాటాన్ని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఆవిష్కరించి అద్బుత విజయాన్ని అందుకుంటున్నారు. గేమ్ ఛేంజర్ లాంటి ఘోర పరాభవం తర్వాత రామ్ చరణ్ ఒక పవర్‌ఫుల్ హిట్ కొట్టడంతో మెగా అభిమానులు థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పుడు అభిమానులకు మరింత ప్రత్యేకమైన అనుభూతిని అందించేందుకు చిత్రబృందం మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది.

లేటెస్ట్ గా 'పెద్ది' సినిమాకు అదనంగా 5 నిమిషాల 56 సెకన్ల కొత్త సన్నివేశాలు జోడిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు ఎక్కడా చూడని ఈ కొత్త ఫుటేజ్ ఈరోజు నుంచి థియేటర్లలో ప్రదర్శించబడనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఈ కొత్త సన్నివేశాల కోసం మరోసారి థియేటర్లకు వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. భారీ స్పందనతో ప్రారంభమైన ఈ చిత్రం 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలవడమే కాకుండా, దక్షిణ భారతదేశంలో నంబర్ వన్ గ్రాసర్‌గా కొత్త రికార్డులు సృష్టించిందని నిర్మాతలు చెబుతున్నారు.
సినిమా కథ..
విజయనగరం సమీపంలోని కొండ కింద ఉన్న ఒక చిన్న గిరిజన గ్రామంలో పెరిగిన యువకుడు పెద్ది (రామ్ చరణ్). ఆ గ్రామానికి సరైన గుర్తింపు ఉండదు. కనీసం రైలు కూడా అక్కడ ఆగదు. గ్రామ ప్రజలు ఉపాధి కోసం పక్క ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఆ గ్రామానికి గుర్తింపు తీసుకురావాలన్నది గ్రామ పెద్ద అప్పలసూరి (జగపతిబాబు) జీవిత లక్ష్యం. గ్రామం అభివృద్ధి చెందాలంటే రైల్వే స్టేషన్ రావాలని ఆయన దశాబ్దాలుగా పోరాడుతుంటాడు. మరోవైపు పెద్ది అద్భుతమైన క్రికెటర్. స్థానిక టోర్నమెంట్లలో డబ్బులు ఇచ్చే వారి తరఫున ఆడుతూ జీవనం సాగిస్తుంటాడు. ఒక సంఘటన కారణంగా పెద్ది జీవితంలో భారీ మార్పు వస్తుంది. క్రికెట్ నుంచి కుస్తీ వైపు, అక్కడి నుంచి పరుగుల ప్రపంచంలోకి అడుగుపెడతాడు. తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తూ, తన గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఢిల్లీ వరకు ప్రయాణిస్తాడు. అసలు పెద్ది ఎందుకు మూడు క్రీడల్లో పాల్గొనాల్సి వచ్చింది? అతని జీవితాన్ని మార్చిన సంఘటన ఏమిటి? అనేది సినిమా స్టోరీ.
Added scenes worked out well 👍🏻
— Pagadala RC (@RamCharanPagad1) June 17, 2026
Love ✅ Comedy ✅ Emotion ✅
Worth re-watch in theaters 🤍🥹🔥#Peddi #RamCharan@PeddiMovieOffl pic.twitter.com/vT26RHAjED












Click it and Unblock the Notifications