vastu tips: పేరు మార్పు వల్ల వాస్తు మొత్తం అనుకూలంగా మారుతుందా?

పేరు మార్చడం వల్ల వాస్తు మొత్తం అనుకూలంగా మారిపోతుందా? అంటే... ఖచ్చితంగా మారదు. జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం... పేరు మార్పుకు, ఇంటి వాస్తుకు చాలా స్పష్టమైన తేడా ఉంది. ఈ రెండూ వేర్వేరు శక్తులు. వాస్తు ప్రభావం వేరుగా ఉంటుంది. వాస్తు అనేది మీరు నివసించే స్థలం, ఇల్లు లేదా ఆఫీసుకు సంబంధించినది. పంచభూతాల (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం) దిశలు, శక్తి ప్రవాహాలపై వాస్తు ఆధారపడి ఉంటుంది. ఇల్లు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాది దిశల్లో తప్పుగా కట్టబడినా... లేదా ఈశాన్యంలో టాయిలెట్, ఆగ్నేయంలో నీటి నిల్వ వంటి వాస్తు దోషాలు ఉంటే, ఆ నెగెటివ్ ఎనర్జీ అలాగే ఉంటుంది. కేవలం మీ పేరు మార్చుకున్నంత మాత్రాన ఆ గోడల దిశలు లేదా ఇంటి దోషాలు మారిపోవు.

పేరు మార్పు ప్రభావం వేరు

పేరు మార్చడం అనేది సంఖ్యాశాస్త్రం లేదా నామ నక్షత్రం కి సంబంధించినది. పేరు మార్చుకోవడం వల్ల మీ వ్యక్తిగత శక్తి, ఆత్మవిశ్వాసం, ఆలోచనా విధానం మెరుగుపడతాయి. ఇది మీ జాతకంలోని గ్రహ దోషాల తీవ్రతను తగ్గించడానికో లేదా మీ అదృష్టాన్ని పెంచడానికో ఉపయోగపడుతుంది కానీ, ఇల్లు ఇచ్చే నెగెటివ్ వైబ్రేషన్స్‌ను ఇది ఆపలేదు. మీకు బాగా ఆరోగ్యం బాగోలేనప్పుడు, మీరు మంచి పౌష్టికాహారం (పేరు మార్పు లాంటిది) తింటే మీ లోపల శక్తి పెరుగుతుంది. కానీ, మీరు మురికిగా, గాలి-వెలుతురు లేని గదిలో (వాస్తు దోషం ఉన్న ఇల్లు) ఉంటే, ఆ వాతావరణం వల్ల మళ్లీ అనారోగ్యం పాలవుతారు. ఇక్కడ ఇల్లు, ఆహారం రెండూ ముఖ్యమే.

Vastu tips Does changing the name lead to entirely positive outcomes

పరిష్కారం ఏమిటి?

ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే, దానికి తగినట్టుగా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి లేదా వాస్తు నిపుణుడిని సంప్రదించాలి. పేరు మార్పు అనేది మీ కెరీర్, వ్యాపారం లేదా వ్యక్తిగత విజయాలకు అదనపు బూస్టింగ్ ఇస్తుంది. పేరు మార్పు వల్ల మీ "జాతకం" లేదా "సమయం" కలిసిరావచ్చు, కానీ మీ ఇంటి "వాస్తు" దోషం అలాగే ఉంటుంది. కాబట్టి పేరు మార్పుతో పాటు, ఇంటి వాస్తును కూడా సరిచూసుకోవడమే సరైన పద్ధతి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం కష్టపడి పనిచేయడం. మనం పనిచేసి ఫలితాన్ని భగవంతుడిపై వదిలేయాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది కూడా ఇదే. పనిచేయడం వరకే మీ బాధ్యత.. ఫలితం గురించి ఆలోచించొద్దు. ఫలితాన్ని భగవంతుడికి అర్పించాలని అని చెప్పాడు. ఇది మీరు గమనంలో ఉంచుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+