టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!!
ప్రపంచ విజేతగా నిలిచిన టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టీ20 ప్రపంచ కప్ లో వరుసగా రెండో సారి ఛాంపియన్ గా అవతరించి టీం ఇండియా కొత్త రికార్డు నెలకొల్పింది. అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్ లో న్యూజీలాండ్ పైన ఏకపక్షంగా విజయం సాధించి.. మూడో సారి ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది. దీంతో.. ఇప్పటికే విజేతకు దక్కాల్సిన ప్రైజ్ మనీ ఐసీసీ ప్రకటించింది. తాజాగా టీం ఇండియా కు బీసీసీఐ భారీ నజరానా అందించేందుకు సిద్దమైంది. టీం సభ్యులను అభినందించింది.
టీ20 ప్రపంచ కప్ లో విజేతగా నిలిచిన టీం ఇండియాకు వరుసగా నజరానాలు అందుతున్నాయి. ప్రపంచ విజేతగా నిలిచిన టీమిండియాకు ఐసీసీ 3 మిలియన్ అమెరికన్ డాలర్లను బహుమతిగా ఇచ్చింది. మన భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.27.48 కోట్లు. గత వరల్డ్ కప్‌తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీ దాదాపు రూ.4 కోట్లు పెరగడం విశేషం. ఇక రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు దాదాపు రూ.14.65 కోట్లు దక్కాయి. ఫైనల్లో ఓడినప్పటికీ, టోర్నీ ఆద్యంతం అద్భుతంగా ఆడినందుకు కివీస్‌కు ఈ భారీ మొత్తం లభించింది. కాగా.. ఇప్పుడు టీమ్‌ఇండియా టీ20 ప్రపంచ కప్ గెలిచిన నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత జట్టుకు రూ.131 కోట్ల నజరానాను ప్రకటించింది. ఈ మొత్తం టీం సభ్యులకు అందనుంది. టీంతో పాటుగా సహాయక సభ్యులు.. సపోర్టింగ్ స్టాఫ్ ను బీసీసీఐ అభినందించింది.

అన్ని జట్లకు ఐసీసీ క్యాష్ అవార్డులు
కాగా, ప్రపంచ కప్ లో ఆడిన జట్లకు ఐసీసీ నగదు కానుకలను ప్రకటించింది. సెమీ ఫైనల్ వరకు వచ్చి తృటిలో ఫైనల్ చేరలేక పోయిన ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లకు ఐసీసీ తలా రూ.7.24 కోట్లు అందజేసింది. ఇక సూపర్ 8 దశకు చేరుకుని వెనుదిరిగిన జట్లు కూడా నగదు బహుమతులు అందుకున్నాయి. పాకిస్థాన్, జింబాబ్వే, శ్రీలంక, వెస్టిండీస్ జట్లకు ఒక్కో జట్టుకు రూ.3.48 కోట్లు చొప్పున ప్రైజ్ మనీ దక్కింది. గ్రూప్ స్టేజ్ దాట లేకపోయిన ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, యూఏఈ, యూఎస్‌ఏ, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నేపాల్, ఐర్లాండ్, ఇటలీ, ఒమన్, నమీబియా.. మొత్తం 12 జట్లకు ఐసీసీ ఒక్కో జట్టుకు రూ.2.29 కోట్లు పంపిణీ చేసింది. ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ జట్టు గ్రూప్ స్టేజ్‌లోనే వెనుదిరగడం అందరినీ ఆశ్చర్యపరి చినప్పటికీ, వారికి కూడా ఐసీసీ తగిన నజరానాను అందించింది. 2026 టీ20 వరల్డ్ కప్ కేవలం ఆట పరంగానే కాదు, ఆదాయం పరంగా కూడా జట్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది












Click it and Unblock the Notifications