Sasikala: తమిళనాట సంచలనం.. కొత్త పార్టీ పెట్టిన చిన్నమ్మ
తమిళనాడు ఎన్నికలకు కొన్ని నెలల ముందు అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ సంచలన రాజకీయ ప్రకటన చేశారు. మంగళవారం ఆమె జయలలిత (అమ్మ), ఎంజీఆర్, అన్నా ఆదర్శ సూత్రాలతో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మౌనంగా ఉంటే ప్రజలకు న్యాయం చేయలేనని ఆమె స్పష్టం చేశారు.జయలలిత జయంతి సందర్భంగా రామనాథపురంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో, తమ నూతన పార్టీకి సంబంధించిన జెండాను ఆవిష్కరించారు.
ఈ మేరకు అన్నాడీఎంకే పై శశికళ తీవ్రంగా మండిపడ్డారు. జైలు నుండి విడుదలయ్యాక తనను మళ్లీ అరెస్టు చేయాలని అన్నాడీఎంకే ప్రయత్నించిందన్నారు. "పార్టీ పతనమవుతోంది. ఈపీఎస్ (ఎడప్పాడి పళనిస్వామి)కి కార్యకర్తలపై శ్రద్ధ లేదు" అని తెలిపారు. ఈపీఎస్ "స్వార్థపరుడని, తన గురించే చూసుకుంటాడని" శశికళ కీలక విమర్శలు చేశారు.
అయితే శశికళకు 2027 వరకు ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధం ఉంది. జయలలితతో పాటు ఆస్తుల కేసులో శిక్ష పడగా, నాలుగు సంవత్సరాల జైలు అనంతరం 2021లో విడుదలయ్యారు. 2016 డిసెంబర్‌లో జయలలిత మరణాంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తాజాగా చెన్నైలో మద్దతుదారులతో సమావేశం తరువాతే ఆమె ఈ రాజకీయ నిర్ణయం ప్రకటించారు.

అయితే ఆమె ప్రకటన ఈపీఎస్‌కు ప్రత్యక్ష సవాల్ గా నిలిచింది. అన్నాడీఎంకే "పది రెట్లకు పైగా" ఓడిపోయినా, ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు శశికళ. "జయలలిత పాలనలోని అన్నాడీఎంకే చేసిన మంచి పనులు తమిళనాడు ప్రజలు మర్చిపోలేరు" అని ఆమె స్పష్టం చేశారు. కొత్తగా పార్టీ ప్రారంభించడానికి ఇదే సరైన సమయమని శశికళ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications