నాపేరు, ఫోటో వాడొద్దు: జైలు నుంచే సోదరుడికి శశికళ లీగల్ నోటీసులు
చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ శుక్రవారం సోదరుడు దివాకరన్‌కు నోటీసులు జారీ చేసింది. తన ఫోటోను, పేరును ఉపయోగించుకోవద్దని అందులో పేర్కొన్నారు. ఆమె జైలు నుంచే ఈ నోటీసులు పంపించారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. ఆమె సోదరుడు దివాకరన్ అటీవల అమ్మ అణి పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు.

చిన్నమ్మ నిర్దేశనం మేరకు చీఫ్ కన్వీనర్‌గా వ్యవహరిస్తానని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మిగతా ఎన్నికల్లోను పోటీ చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేపట్టి, పార్టీ నిర్వాహకులను ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై శశికళ ఆయనకు నోటీసులు జైలు నుంచే ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications