వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాత్కాలికం, సంతోషంగా ఉంది: శశికళ కంటతడి, రివ్యూ కోరినా.. షాక్ తప్పదా?

|
Google Oneindia TeluguNews

చెన్నై: సుప్రీం కోర్టు తీర్పు పైన అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మంగళవారం నాడు రాత్రి స్పందించారు. గోల్డెన్ బే రిసార్టు నుంచి పోయెస్ గార్డెన్ బయలుదేరే సమయంలో ఆమె మాట్లాడారు.

'జయలలిత ప్రతిష్ట మంటకలిసింది, 2 నెలల్లో శశికళ పార్టీ ఉండదు''జయలలిత ప్రతిష్ట మంటకలిసింది, 2 నెలల్లో శశికళ పార్టీ ఉండదు'

ప్రస్తుతం తనకు వచ్చిన సమస్య తాత్కాలికమే అన్నారు. సమస్యను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కష్ట సమయంలో ఎమ్మెల్యేలు తనకు అండగా ఉండటం సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు.

sasikala

అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందరూ ఐక్యమత్యంగా ఉన్నారని చెప్పారు. శాసన సభా పక్షం తన నేతను ఎన్నుకున్న తర్వాత గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించేందుకు ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.

పన్నీరుకు షాక్: సీనియర్ నేతలపై వేటు, శశికళ హింసించారన్న రిసార్ట్ ఎమ్మెల్యే పన్నీరుకు షాక్: సీనియర్ నేతలపై వేటు, శశికళ హింసించారన్న రిసార్ట్ ఎమ్మెల్యే

నా పైన కుట్రలు చేసిన వారికి ఒకటి చెప్పదలుచుకున్నానని, ఏ శక్తి పార్టీ నుంచి తనను వేరు చేయలేదన్నారు. మాట్లాడుతున్న సమయంలో ఆమె భావోద్వేగానికి గురై, కంటతడి పెట్టారు.

అన్నాడీఎంకే ప్రభుత్వమే కొనసాగాలి: పన్నీరు వద్దని శశికళ అన్నాడీఎంకే ప్రభుత్వమే కొనసాగాలి: పన్నీరు వద్దని శశికళ

మరోవైపు, సుప్రీం తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ప్రతి ఇంకా ఆమెకు అందలేదని చిన్నమ్మ వర్గీయులు చెబుతున్నారు. శశికళను అరెస్టు చేసే విషయమై చెన్నై పోలీసులకు కూడా ఇంకా ఎటువంటి ఆదేశాలు రాలేదని తెలుస్తోంది. అయితే, తాను లొంగిపోయేందుకు నాలుగు వారాల గడువు కావాలని శశికళ కోరే అవకాశాలున్నాయి.

బయటకు రాకండి, రిసార్ట్‌కు వెళ్లొద్దు: పన్నీరుకు డీజీపీబయటకు రాకండి, రిసార్ట్‌కు వెళ్లొద్దు: పన్నీరుకు డీజీపీ

శశికళ లాయర్లు సుప్రీం కోర్టులో రేపు రివ్యూ పిటిషన్ వేయనున్నారని, తీర్పు ఇచ్చిన డివిజన్ బెంచ్ ముందే ఈ పిటిషన్ వేస్తారు. అయితే, రివ్యూ పిటిషన్ వేసిన ఆమెకు ఊరట లభించకపోవచ్చునని న్యాయనిపుణులు భావిస్తున్నారు. కాగా, ప్రస్తుతం గోల్డెన్ బే రిసార్ట్ లో శశికళ ఉండటంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

English summary
Legal experts have said that Sasijala and others can file a review petition, but it is highly unlikely to get any relief from the Sc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X