సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతా: శశకళ సంచలనం
తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగుపెడతానని, అప్పటి వరకూ అటువైపు కన్నెత్తి కూడా చూడనని శశికళ.. పార్టీ నేతలకు తేల్చి చెప్పారు.
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగుపెడతానని, అప్పటి వరకూ అటువైపు కన్నెత్తి కూడా చూడనని శశికళ.. మంత్రులకు, పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బాటలోనే తాను నడవాలనుకుంటున్నానని చెప్పినట్టు సమాచారం.
అందుకనే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలతోపాటు, రిపబ్లిక్ వేడుకలకు కూడా ఆమె దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. జనవరి 23న తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శశికళ ఆరోజు అసెంబ్లీకి వస్తారని అంతా భావించారు. వీఐపీ గ్యాలరీలో కూర్చుని సమావేశాలను తిలకిస్తారని అందరూ అనుకున్నారు.

కానీ ఆమె హాజరుకాలేదు. ఈ విషయమై కొందరు సన్నిహిత శాసనసభ్యులు ఆమె వద్ద ప్రస్తావించగా.. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగుపెడతానని, అప్పటి వరకూ అటువైపు చూడనని శశికళ.. సీనియర్ మంత్రులకు తేల్చి చెప్పినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications