కోర్టుకు 'సత్యం' రామలింగరాజు ఇలా.. (పిక్చర్స్)
హైదరాబాద్: కార్పోరేట్ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణంగా పేరుగాంచిన 'సత్యం కుంభకోణం' కేసు విచారణను నిందితులందరూ అక్టోబర్ 27న తమ ముందు హాజరు కావాలని హైదరాబాదు నాంపల్లిలోని సీబీఐ కోర్టు సోమవారం ఆదేశించింది. జడ్జిమెంట్‌కి స్పష్టమైన తేదీని ప్రకటించలేదని సీబీఐ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె సురేందర్ తెలిపారు.
సత్యం కంప్యూటర్స్ సంస్థాపకుడు, మాజీ ఛైర్మన్ రామలింగ రాజు, ఆయన కుటుంబ సభ్యులు, సత్యం అధికారులు, ప్రైస్ వాటర్ కూపర్ హౌస్ మాజీ ఆడిటర్లు ఆదేశించిన తేదీన కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, సత్యం కంప్యూటర్స్ సిఎఫ్‌ఓ వడ్లమాని శ్రీనివాస్, ఆడిటింగ్ నిర్వహించిన పీడబ్లుయసీ ఆడిటింగ్ సంస్థతోపాటు ఆడిటర్లు తళ్లూరి శ్రీనివాస్, గోపాలకృష్ణన్‌తోపాటు దాదాపు 15 మందిని నిందితులుగా పేర్కొంది.
నేర విచారణ చట్టంలోని సెక్షన్ 200తోపాటు సెబీ చట్టంలోని సెక్షన్లు 12(ఎ), 24(1), 26, 27ల కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. అంతేగాక, సత్యం కంప్యూటర్స్‌కు ఆడిటింగ్ నిర్వహించిన ఆడిటర్లు నమ్మకద్రోహానికి పాల్పడ్డారని, తప్పుడు ఆడిటింగ్ నివేదికలు ఇచ్చి లక్షలాది మంది మదుపరులను మోసం చేశారని సెబి ఆరోపించింది.
2009 జనవరి 7న అప్పట్లో సత్యం కంప్యూటర్‌స చైర్మన్‌గా ఉన్న రామలింగరాజు తన తప్పిదాలను అంగీకరిస్తూ సెబికి మెయిల్ పంపించారు. షేర్ల విక్రయం ద్వారా రూ.543.93 కోట్ల మేరకు రాజు సోదరులు అనుచిత లబ్ధి పొందారని, షేర్లను తాకట్టు పెట్టడం ద్వారా రూ.1,258 కోట్లను పొందారని సెబి పేర్కొంది.

రామలింగ రాజు
సత్యం కంప్యూటర్స్ సంస్థాపకుడు, మాజీ చైర్మన్ రామలింగ రాజు సోమవారం హైదరాబాదులోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరై, తిరిగి వెళ్తున్న దృశ్యం.

రామలింగ రాజు
సత్యం కంప్యూటర్స్ సంస్థాపకుడు, మాజీ చైర్మన్ రామలింగ రాజు సోమవారం హైదరాబాదులోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరై, తిరిగి వెళ్తూ...

రామలింగ రాజు
సత్యం కంప్యూటర్స్ సంస్థాపకుడు, మాజీ చైర్మన్ రామలింగ రాజు సోమవారం హైదరాబాదులోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరై, తిరిగి వెళ్తున్న దృశ్యం.

రామలింగ రాజు
'సత్యం కుంభకోణం' కేసు విచారణను నిందితులందరూ అక్టోబర్ 27న తమ ముందు హాజరు కావాలని హైదరాబాదు నాంపల్లిలోని సీబీఐ కోర్టు సోమవారం ఆదేశించింది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications