కర్ణాటక అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ ‘లైవ్’‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్: కాంగ్రెస్ హ్యాపీ

న్యూఢిల్లీ/బెంగళూరు: బీఎస్ యడ్యూరప్ప ప్రభుత్వం బలనిరూపణ పరీక్ష నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో అన్ని మీడియా ఛానళ్లలో కూడా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

సుప్రీం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వడం పట్ల కాంగ్రెస్-జేడీఎస్ తరపు న్యాయవాది కపిల్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యక్ష ప్రసారం వల్ల తమ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లకుండా అవకాశం ఉంటుందని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

SC allows live telecast of assembly proceedings

అయితే, ప్రొటెం స్పీకర్ విషయంలో మాత్రం జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు సుప్రీంకోర్టులు ఎదురుదెబ్బే తగిలింది. సీనియరిటీని పరిగణలోకి తీసుకోకుండా గవర్నర్.. ప్రొటెం స్పీకర్‌ను నియమించారని కాంగ్రెస్ తరపున కపిల్ సిబాల్ వాదించారు. ఆయన నియామకం చెల్లదని అన్నారు.

అయితే, సుప్రీంకోర్టు మాత్రం ఇందుకు ప్రతికూలంగా స్పందించింది. ప్రొటెం స్పీకర్ నియామకంలో ప్రతీసారి సీనియరిటీని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రొటెం స్పీకర్ నియామకంపై కాంగ్రెస్-జేడీఎస్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలోనే బలనిరూపణ జరుగుతుందని స్పష్టం చేసింది. శనివారం సాయంత్రం4గంటలకు బలనిరూపణ నేపథ్యంలో సుప్రీం తీర్పు కాంగ్రెస్-జేడీఎస్‌లకు ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+