రెండు విడతలు: ‘నీట్‌’పై సుప్రీం కీలక తీర్పు

న్యూఢిల్లీ: జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) పై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. 2016-17 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఏకీకృత వైద్య విద్య ప్రవేశపరీక్షను నిర్వహించాలని నిర్వహించాలని ఆదేశించింది. నీట్ పరీక్షను రెండు విడతలుగా ప్రవేశపరీక్షను నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

తమ ఆదేశాలను అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. నీట్‌ పరీక్షను మే 1, జులై 24న రెండు విడతలుగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.

SC approves NEET for admission in MBBS; 1st phase of exam on May 1, second phase on July 24

ఆగస్టు 17న రెండు పరీక్షల ఫలితాలు విడుదల చేయాలని సూచించింది. సెప్టెంబర్‌ 30 నాటికి కౌన్సిలింగ్‌ పూర్తిచేసి అక్టోబర్‌ 1న తరగతులు ప్రారంభించాలని ఆదేశించింది.

కాగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎంసెట్ పరీక్ష యథాతథంగా ఉంటుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు సమాచారాన్ని తీసుకుంటామని, అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయానికి గురి కావద్దని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+