అది క్రూరత్వం, ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం చెప్పండి: సుప్రీం కోర్టు
మరణశిక్ష పడ్డ ఖైదీలకు ఉరిశిక్ష విధించడం కాకుండా మరో ప్రత్యామ్నాయం చూపించాలని సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
న్యూఢిల్లీ: మరణశిక్ష పడ్డ ఖైదీలకు ఉరిశిక్ష విధించడం కాకుండా మరో ప్రత్యామ్నాయం చూపించాలని సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మెడకు ఉరితాడు బిగించి మరణశిక్ష విధించడమనేది క్రూరమైన పద్దతని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
శాంతి చర్చలన్ని మాటలకే పరిమితమైపోయాయని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ విషయంలో అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ సహాయం తీసుకున్న సుప్రీంకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఉరిశిక్షకు ప్రత్యామ్నాయాన్ని సూచించాలని సదరు నోటీసుల్లో పేర్కొంది.

ఉరిశిక్ష అమలు సందర్భంగా దోషి తీవ్రమైన బాధను అనుభవిస్తున్నారని కోర్టు అందులో చెప్పుకొచ్చింది. 30ఏళ్ల క్రితమే సుప్రీం కోర్టే ఉరిశిక్ష అమలు తీర్పు ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తుచేసింది. రాజ్యాంగ సవరణలకు అవకాశమున్న భారతీయ సమాజంలో మరణ దండనను ఉరిశిక్ష అమలు చేయడం సబబు కాదని తెలిపింది.












Click it and Unblock the Notifications