నిర్భయ కేసులో సుప్రీం తీర్పు నేడే: ఘోరం జరిగిందిలా..

న్యూఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక హత్యాచారం కేసులో శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించనుంది. దేశ రాజధానిలో జరిగిన ఆ పాశవిక ఘటన దేశ మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే.

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక హత్యాచారం కేసులో శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించనుంది. దేశ రాజధానిలో జరిగిన ఆ పాశవిక ఘటన దేశ మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురికి సుప్రీంకోర్టు తన తీర్పులో ఉరిశిక్ష విధిస్తుందా? లేక జీవిత ఖైదుతో సరిపెడుతుందా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

ఈ కేసులో 2013లోనే ప్రత్యేక కోర్టు ఈ నలుగురికీ ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పగా, హైకోర్టు కూడా మరుసటి సంవత్సరం దాన్ని ఖరారు చేసింది. అయితే, అక్షయ్ టాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్.. ఈ నలుగురు నిందితులు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడంతో తుది తీర్పు నేటికి వాయిదా పడింది.

SC to pronounce verdict in Nirbhaya gang rape case on Friday

2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు ఆ బస్సులో ఈ నలుగురితోపాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వీరంతా కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. కాగా, దోషుల్లో ఒకరైన రామ్ సింగ్ తీహర్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో కేవలం మూడేళ్ల శిక్ష అనుభవించి స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోయాడు. దీనిపై కూడా దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. దీంతో ఇప్పుడు బాలనేరస్తుల చట్టాన్ని కూడా సవరించారు.

16-18ఏళ్ల మధ్య వయస్సున్నవారు తీవ్రమైన నేరాలు చేస్తే వారిని పెద్దవాళ్లుగా భావించాలని ఈ చట్టం ద్వారా స్పష్టం చేశారు. ఫిజియోథెరపీ చదువుతున్న నిర్భయ తన స్నేహితుడితో కలిసి దక్షిణ ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో బస్సులో ఎక్కింది.

కాగా, అతడిపై తీవ్రంగా దాడి చేసిన ఈ ఆరుగురు దోషులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి చిత్ర హింసలకు గురిచేశారు. ఇనుపరాడ్లతో ఆమె శరీరాన్ని ఛిద్రం చేశారు. ఆ తర్వాత నగ్నంగా రోడ్డుపై పడేసి పరారయ్యారు. కాగా, ఆమె కొద్ది రోజులకే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురు చేసుకున్న అప్పీలుపై జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ భానుమతిలతో కూడిన సుప్రీం ధర్మాసనం తుది తీర్పును శుక్రవారం వెల్లడించనుంది. న్యాయమూర్తులిద్దరూ వాళ్ల అప్పీలును తిరస్కరిస్తే నిందితులకు ఉరిశిక్ష ఖరారైనట్లే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+