• search

సుప్రీం వివాదం: రంగంలోకి బార్ అసోసియేషన్, అత్యవసర సమావేశం, కీలక తీర్మానాలు

By Ramesh Babu
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జిల మధ్య నెలకొన్న అభిప్రాయభేదాలపై తాము దృష్టి సారించినట్టు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు వికాస్ సింగ్ తెలిపారు. సుప్రీంకోర్టులో సంక్షోభం నేపథ్యంలో శనివారం ఎస్‌సీబీఏ అత్యవసరంగా సమావేశమైంది.

  సుప్రీం వివాదం: అభిప్రాయ భేదాలు సమసిపోతాయి, రాజకీయాలొద్దు: బార్ కౌన్సిల్ ఛైర్మన్

  'సుప్రీంకోర్టులో అవాంఛనీయ ఘటనలు'.. ఏమిటవి? సీజేఐ జోక్యం మితిమీరుతోందా?

  సుప్రీం కోర్టులోనూ మహిళల పట్ల వివక్ష! 67 ఏళ్లలో ఆరుగురే మహిళా న్యాయమూర్తులు

  అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ నలుగురు న్యాయమూర్తులు శుక్రవారం పేర్కొన్నట్టు అభిప్రాయ భేదాలు ఏవైనా ఉంటే వాటిని తక్షణం పరిష్కరించాలని ఎస్‌సీ బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

  scba-president

  సుప్రీంకోర్టులో పాలనా పరిస్థితులు సజావుగా సాగడం లేదని, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని నలుగురు సుప్రీం న్యాయమూర్తులు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.

  ఎన్నడూ లేని విధంగా న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో శనివారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సమావేశమై నలుగురు న్యాయమూర్తుల వ్యాఖ్యలకు సంబంధించి కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపింది.

  అవేమిటంటే.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీనియర్ జడ్జిలకు తలెత్తిన విభేదాలను సుప్రీంకోర్టు పూర్తిస్థాయి ధర్మాసనం పరిశీలించాలి. అన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు(పిల్‌) ప్రధాన న్యాయమూర్తి లేదా కొలీజియంలోని న్యాయమూర్తులే పరిశీలించాలి. ఈనెల 15 కోసం లిస్ట్ చేసిన పిల్‌లను వేర్వేరు బెంచ్‌ల నుంచి కొలీజియం సభ్యులైన జడ్జిల బెంచ్‌కు బదిలీ చేయాలి.

  ఈ విషయాలపై అవసరమైతే తాము ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర జడ్జిలతో చర్చించేందుకు సిద్ధమని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రకటించింది. నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలపై ఏ రాజకీయ పార్టీ గానీ, రాజకీయ నాయకులు గానీ మితిమీరి వ్యాఖ్యలు చేయకూడదని సూచించింది.

  తాము తీసుకున్న నిర్ణయాలను సీజేఐకి పంపుతామని, సాధ్యమైనంత త్వరలో అన్ని అంశాలూ పరిష్కరించాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. ఎస్‌‌సీబీసీ తొలుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుస్తుందని, ఆయన కూడా తమ అభిప్రాయాలతో ఏకీభవిస్తే ఇతర జడ్జీల అపాయింట్‌మెంట్ కూడా తీసుకుని వారి మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని వికాస్ సింగ్ తెలిపారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Supreme Court Bar Association (SCBA) on Saturday expressed "grave concern" over the sharp division among the top Supreme Court judges and urged for a Full Court hearing on the crisis while demanding that all PILs, including the one on the mysterious death of judge B H Loya, be referred to either the CJI or the judges in the collegium. The SCBA executive committee held an emergent meeting and unanimously adopted two resolutions on the crisis facing the top judiciary. In the first resolution, the SCBA said the differences that have been reported in the press conference by four senior judges of the Supreme Court and the other differences which are reflected in newspapers are of "grave concern and should be immediately considered by the Full Court of the Supreme Court".

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  ఎన్నికల ఫలితాలు 
  మధ్యప్రదేశ్ - 230
  PartyLW
  CONG6647
  BJP6347
  IND13
  OTH30
  రాజస్థాన్ - 199
  PartyLW
  CONG1089
  BJP172
  IND118
  OTH113
  ఛత్తీస్‌గఢ్ - 90
  PartyLW
  CONG2244
  BJP78
  BSP+63
  OTH00
  తెలంగాణ - 119
  PartyLW
  TRS088
  TDP, CONG+021
  AIMIM07
  OTH03
  మిజోరాం - 40
  Party20182013
  MNF265
  IND80
  CONG534
  OTH10
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more