షాకింగ్: తరగతి గదిలోనే.. విద్యార్థిని మెడలో తాళి కట్టిన బాలుడు, నెట్‌లో వీడియో హల్‌చల్

Posted By:
Subscribe to Oneindia Telugu
  తరగతి గదిలోనే.. విద్యార్థిని మెడలో తాళి కట్టిన బాలుడు, వీడియో వైరల్ ! video viral

  చెన్నై: బాల్య వివాహాలు నేరం అని తెలిసినా అవి ఆగడం లేదు. తాజాగా తరగతి గదిలోనే ఓ విద్యార్థిని మెడలో బాలుడు తాళికడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.

  29 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ బాలుడు చేతిలో తాళి పట్టుకుని 'అమ్మా' అంటూ మొబైల్ వైపు చూస్తాడు. ఆ వెంటనే 'తాళి కట్టరా' అంటూ తమిళంలో మహిళ గొంతు వినిపిస్తుంది.

  Schoolgirl’s wedding video goes viral, shocks people

  ఆ వెంటనే స్కూలు యూనిఫాం ధరించి ఉన్న సదరు బాలిక మెడలో ఆ బాలుడు తాళి కట్టేశాడు. అసలీ జంట ఎవరు? ఈ పెళ్లి ఎక్కడ జరిగిందన్న దానిపై వివరాలేమీ లేవు. ఆ విద్యార్థిని ముఖం స్పష్టంగా కనిపించకుండా ఈ వీడియో చిత్రీకరించారు.

  సోషల్ మీడియాలో ఈ వీడియో హల్‌చల్ చేస్తుండడంతో బాలల హక్కుల సంరక్షణ సంస్థల ప్రతినిధులు, పోలీసులు ఈ జంట కోసం ముమ్మర గాలింపు మొదలుపెట్టారు. దీనిపై బాలల హక్కుల సంరక్షణ సంస్థ కార్యకర్త ఒకరు మాట్లాడుతూ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు.

  వీడియోలో కనిపిస్తున్న బాలిక ప్రభుత్వ పాఠశాల యూనిఫాం ధరించి ఉందని, అన్ని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థినులూ అదే యూనిఫాం ధరిస్తారు కాబట్టి ఈ ఘటన ఏ స్కూలులో జరిగిందో కనుక్కోవడం కష్టతరంగా మారిందని చెప్పారు.

  జిల్లా బాలల సంరక్షణ అధికారి మాట్లాడుతూ.. 'మేం తమిళనాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల బాలల సంరక్షణ అధికారులను అప్రమత్తం చేశాం. ఈ ఘటన ఏ జిల్లాలో జరిగిందో కనుక్కోమని సూచించాం. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు చూస్తే.. ఇది చెన్నైలోనే ఏదో ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వీడియో ఎక్కడ్నుంచి అప్‌లోడ్ అయిందో కూడా తెలుసుకోమని సైబర్ క్రైమ్ పోలీసులను కూడా కోరాం..' అని వివరించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The video of a boy tying the ‘thaali’ to a girl, wearing a school uniform, is doing the rounds on social media, raising the question if it was a minor marriage. Child rights activists, district child protection officers (DCPOs) and teacher’s associations are trying to find if the incident happened for real. The cyber crime department, too, has been informed about the incident. In the 29 seconds video, the girl, wearing the uniform of a government school, with her hair braided, stands facing a boy, who looks like a teenager. The incident is filmed in a house which belongs to a lower middle-class settlement.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి