మరో ఘోరం: స్కూటీపై వెళ్తున్న దంపతులను కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లారు, మృతి

రాయ్‌పూర్: ఢిల్లీలోని ఓ యువతిని కారు ఈడ్చుకెళ్లిన ఘటన మరువకముందే.. అలాంటి ఘటనే మరొకటి జరిగింది. స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలను ఓ కారు ఢీట్టింది. ఆ తర్వాత 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంతో దంపతులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గ్ పోల్‌సాయిపరా నివాసి జ్ఞాన్‌చంద్ లేఖానీ (56) తన భార్య వందనా లేఖానీ (45 ఏళ్లు)తో కలిసి స్కూటీలో రాజ్‌నంద్‌గావ్‌కు వెళ్లారు. అక్కడ అతను తన పరిచయస్తుల స్థలంలో ఒక సంగీత కచేరీలో పాల్గొన్నారు. భార్యాభర్తలిద్దరూ రాజ్‌నంద్‌గావ్‌ నుంచి కోటవైపు వస్తున్నారు.

scooty ride couple killed in car collision in durg, Chhattisgarh

ఆ మధ్యాహ్నం 12.30 గంటలకు శివనాథ్ ఓవర్ బ్రిడ్జిపైకి రాగానే ముందు నుంచి కారు ఢీకొట్టింది. కారు వేగంగా ఢీకొనడంతో భార్యాభర్తలిద్దరూ దాదాపు 300 మీటర్లు ఈడ్చుకెళ్లి వంతెన పక్క గోడను ఢీకొట్టారు.

ఘటన అనంతరం కారులో ఉన్నవారు కారు వదిలి పారిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పుల్గావ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన జంటను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారిద్దరూ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+