కోటిమంది ఉద్యోగం హుష్‌కాక్.. 97 శాతం మంది ఆదాయం తగ్గింది.. ఇదీ కరోనా దెబ్బ లెక్క...
కరోనా సెకండ్ వేవ్ గజగజ వణికించింది. ప్రాణాలతో చెలగాటం ఆడింది. యువత అయితే పిట్టల్లా రాలిపోయారు. ఇదీ అందరికీ తెలిసిన విషయమే.. రోజు వార్తలు చదివితే అర్థం అవుతోంది. అయితే సెకండ్ వేవ్ వల్ల భారత్‌లో భారీగా ఉద్యోగాలకు కోత పడ్డాయి. వైరస్ పేరు చెప్పి ఉద్యోగులను కంపెనీలు నిర్దాక్ష్యిణంగా తీసేశాయి. అలా దేశంలో 1 కోటి మందిని తీసేశాయి. మిగతా వారు జాబ్ చేస్తున్నారు.. కానీ జీతాన్ని మాత్రం కంపెనీలు తగ్గించాయి. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలియజేసింది.

కోటి మంది ఉద్యోగం కోల్పోయారు..
కరోనా సెకండ్ వేవ్ కంటి మీద కునుకులేకుండా చెయ్యగా.. వైరస్ దెబ్బకు దేశంలో లాక్‌డౌన్ విధించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కరోనా సెకండ్ వేవ్ భయపెట్టడమే కాదు.. ఆర్థికంగా కూడా ఇబ్బందులు పెడుతోంది. CMIE చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహేష్ వ్యాస్ లెక్కల ప్రకారం కరోనా సెకండ్ వేవ్‌లో కోటి మంది తమ ఉద్యోగాలు కోల్పోయారని, 97 శాతం మంది ఇళ్లలో ఆదాయం తగ్గిందని వెల్లడించారు.

12 శాతానికి చేరిన నిరుద్యోగిత రేటు
ఏప్రిల్లో 8 శాతం ఉన్న నిరుద్యోగ రేటు.. ఇప్పుడు మే నెలలో 12 శాతానికి పెరిగిందని, ఉద్యోగాలు కోల్పోయినవారికి కొత్త ఉద్యోగాలు దొరకడం కష్టం అయ్యిందని మహేష్ వ్యాస్ అన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఉద్యోగాలు కోల్పోయే వ్యక్తులు ఉపాధి పొందడం కష్టమని, నాణ్యమైన ఉద్యోగ అవకాశాలు తిరిగిరావడానికి ఒక సంవత్సరం పట్టవచ్చునని అభిప్రాయపడ్డారు.

1.75 లక్షల గృహాలపై సర్వే
లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు, వ్యాపార కార్యకాలాపాలు ప్రారంభించిన తర్వాత.. ఆర్థిక పరిస్థతి బాగుపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాదిలో ఆదాయాల తీరుపై 1.75 లక్షల గృహాలపై సీఎంఐఈ చేసిన సర్వేలో ఈ విషయం తెలిసిందని వ్యాస్ చెప్పారు. 3 శాతం మంది ఆదాయం మాత్రమే పెరిగిందని, 55 శాతం మంది కరోనా కారణంగా ప్రభావితం అయ్యారని చెప్పారు. ఇక 42 శాతం మంది ఆదాయం స్థిరంగా ఉన్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications