ఆ ఎస్టేట్ నాది!: 'కొడనాడు'పై మహిళ, జయలలితకు రెండో ఇల్లు
దివంగత జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ సెక్యూరిటీ గార్డు హత్య కలకలం రేపుతోంది.
చెన్నై: దివంగత జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ సెక్యూరిటీ గార్డు హత్య కలకలం రేపుతోంది. కోటగిరికి సమీపంలో జయలలితకు చెందిన ఈ టీ ఎస్టేట్ వద్ద గార్డుగా పని చేస్తున్న ఓంకార్ బహదూర్ (51) అనే వ్యక్తిని సోమవారం తెల్లవారుజామున 10 మంది గుర్తు తెలియని నరికి చంపారు.
దీనిని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు, కొడనాడ్ ఎస్టేట్ ప్రాపర్టీ తనదేనని ఓ మహిళ తెరపైకి వచ్చారు. ఈ ఎస్టేట్ జయలలితది. కానీ ఇప్పుడు మహిళ తెరపైకి రావడం చర్చకు వచ్చింది.

ఎస్టేట్ తనదని ఓ మహిళ
ఈ ఎస్టేట్ తనది అని సదరు మహిళ చెప్పారు. ఇందుకు సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. అన్నీ కూడా తన పేరిటనే ఉన్నాయన్నారు. అయితే, ఆమె మానసిక పరిస్థితి బాగా లేదని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.

జయలలిత రెండో ఇల్లుగా..
కొడనాడ్ ఎస్టేట్ జయలలితకు రెండో ఇల్లుగా చెబుతారు. అమ్మ ఈ ఎస్టేట్‌కు వచ్చినప్పుడల్లా కారును ఆపి, తమతో ఆప్యాయంగా మాట్లాడేవారని ఈ ఎస్టేట్‌లో పని చేసే వారు ఆమె మృతి చెందిన సమయంలో గుర్తు చేసుకున్నారు.

ఆస్తుల కేసు విచారణ సమయంలో..
జయలలిత ఆస్తుల కేసు విచారణ నేపథ్యంలో ఈ ఎస్టేట్ కూడా విచారణ అధికారుల దృష్టిలో ఉంది. ఆస్తుల కేసు నేపథ్యంలో ఈ ఎస్టేట్‌ను సీజ్ చేస్తారనే ప్రచారం కూడా సాగింది. ఆమె మృతి నేపథ్యంలో ఈ ఎస్టేట్ సీజ్ అవుతుందన్న ప్రచారానికి తెరపడింది.

విశ్రాంతి కోసం
కొడనాడు టీ ఎస్టేట్ నీలగిరి జిల్లాలోని కొటగిరి సమీపంలో ఉంది. జయలలిత, శశికళ తదితరులు అప్పుడప్పుడు విశ్రాంతి కోసం ఇక్కడకు వెళ్లేవారు.

దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
కాగా, జయలలితకు చెందిన టీ ఎస్టేట్ సెక్యూరిటీ గార్డు హత్యకు గురైన విషయం తెలిసిందే. కోటగిరికి సమీపంలో జయలలితకు చెందిన కోదనాడ్ ఎస్టేట్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న బహదూర్‌ను సోమవారం తెల్లవారుజామున వ్యక్తులు దారుణంగా నరికి చంపారు.
అదే సమయంలో కృష్ణా బహదూర్ అనే మరో వాచ్‌మెన్ వారిని అదుపు చేయడానికి యత్నించగా అతనిపై దాడి చేసి పరారయ్యారు. క్షతగాత్రుడు కృష్ణా బహదూర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications