కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీపై దేశ ద్రోహం కేసు
లక్నో: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మీద దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలోని మహోబా సివిల్ కోర్టులో ఆయన మీద సుమోటో కేసు నమోదు అయ్యింది.
జాతీయ న్యాయ నియామాకాల కమిషన్ (ఎన్ జేఏసీ) చెల్లదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అరుణ్ జైట్లీ విమర్శలు చేశారు. ప్రజల చేత ఎన్నుకోబడని వ్యక్తుల నియంతృత్వాన్ని భారత ప్రజాస్వామ్యం అంగీకరించబోదని అరుణ్ జైట్లీ తన బ్లాగ్ లో వ్యాఖ్యలు పోస్టు చేశారు.
అదే విదంగా అరుణ్ జైట్లీ చేసిన విమర్శలు వివిద దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. విషయం తెలుసుకున్న మహోబా సివిల్ కోర్టు న్యాయమూర్తి అంకిత్ జియోల్ సుమోటో కేసు నమోదు చేశారు. నవంబర్ 19వ తేదిన కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ చేస్తూ నోటీసులు ఇచ్చారు.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీద భారత శిక్షాస్మృతి ప్రకారం 124ఏ సెక్షన్ దేశద్రోహం, సెక్షన్ 505 బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి అభియోగాలు మోపారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు కష్టాలు మొదలైనాయి.
అదే విదంగా గ్యాంగ్‌రేప్ ల విషయంలో చాలాసందర్భాల్లో అసలు కన్నా కల్పితమైన ఆరోపణలే ఎక్కువగా ఉంటున్నాయని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎస్పీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్‌కు కూడా న్యాయమూర్తి అంకిత్ జియోల్ సమన్లు జారీచేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications