చాణుక్యుడి ఎంట్రీతో హీట్ పెరిగిపోయింది, ఆ నాయకులు, గాలి జనార్దన్ రెడ్డికి నో ఎంట్రీ!

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందేందుకు అన్ని పార్టీలు భారీ వ్యూహాలు రచిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో మెజారిటీ ఎమ్మెల్యేలను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌కు సవాలు చేసేందుకు బీజేపీ, జేడీఎస్‌లు కూటమిగా ఏర్పడ్డాయి. కర్ణాటకలో ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విమర్శించారు.

ప్రధాని మోదీ తర్వాత బీజేపీ చాణక్యుడు అమిత్ షా ఇప్పడు కర్ణాటకలోని ప్రవేశించారు. కాంగ్రెస్‌కు చెందిన ప్రధాన నేతలు, డీకే శివకుమార్ సోదరులు కోటపై నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని ప్లాన్ చేశారు. మంగళవారం సాయంత్రం బీజేపీ అభ్యర్థి డాక్టర మంజునాథ్ పోటీ చేస్తున్న. బెంగళూరు రూరల్ లోక్ సభ నియోజకవర్గంలోని చెన్నపట్నం నుంచి అమిత్ షా భారీ రోడ్ షో ఏర్పాటు చేశారు.

Senior leaders of BJP and JDS parties holding discussions with Union Minister Amit Shah

2024 లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో అత్యదిక సీట్లు కైవసం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో పాటు కర్ణాటక బీజేపీ నాయకులు పక్కాప్లాన్ చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం, కాంగ్రెస్ ను ఓడించడానికి అనుసరించాలన్సిన ప్లాన్ గురించి చర్చించడానికి బెంగళూరులోని తాజ్ వెస్టెండ్ హోటల్‌లో బీజేపీ, జేడీఎస్ నేతలతో చర్చలు జరిపారు. ఇరు పార్టీల నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు.

ఇప్పటికే పలు ప్రాంతాల్లో బీజేపీ, జేడీఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని, దీన్ని పరిష్కరించేందుకు అమిత్ షా బీజేపీ, జేడీఎస్ నేతలకు సూచనలు చేస్తున్నారని తెలిసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ ను ఓడించడానికి పలు వ్యూహాలు పన్ననున్నారు. బీజేపీ-జేడీఎస్ నేతలతో అమిత్ షా సమన్వయ సమావేశానికి బీజేపీ నుంచి 15 మంది, జేడీఎస్ నుంచి 8 మంది నాయకులను మాత్రమే ఆహ్వానించడం హాట్ టాపిక్ అయ్యింది.

Senior leaders of BJP and JDS parties holding discussions with Union Minister Amit Shah

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో బీజేపీలో ముఖ్యమైన నాయకులు మాత్రమే సమావేశం అవుతున్నారు. బీజేపీ నుంచి బీఎస్ యడ్యూరప్ప, బీవై విజయేంద్ర, రాధామోహన్ దాస్ అగర్వాల్, సుధాకర్ రెడ్డి, ఆర్ అశోక్, ప్రహ్లాద్ జోషి, డీవీ సదానంద గౌడ, బసవరాజ్ బోమ్మయ్, నలీన్ కుమార్ కటీల్, గోవింద కారజోల, సిటీ రవి, బి శ్రీరాములు, సీఎన్ అశ్వత్ నారాయణ్, నిర్మల్ కుమార్ సురానా, జీవీ రాజేష్ లను మాత్రమే ఆహ్వానించారు. ఇక జేడీఎస్ నుంచి మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి, జీటీ దేవేగౌడ, వెంకట్ రావ్ నాడేగౌడ, సీఎస్ పుట్టరాజు, సా రా మహేష, హెచ్ కే కుమారస్వామి, నిఖిల్ కుమారస్వామిని మాత్రమే ఆహ్వానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+