మెడిసిన్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్: జీవిత శిక్ష

మణిపాల్: మెడిసిన్ విద్యార్థినిని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన ముగ్గురు కామాంధులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఇదే కేసులో ఇద్దరికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

2013 జూన్ 20వ తేదిన మణిపాల్ మెడిసిన్ విద్యార్థిని ఆటోలో కిడ్నాప్ చేసిన నిందితులు నిర్జన ప్రదేశంలోకి తీసుకు వెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. తరువాత అదే ఆటోలో తీసుకు వెళ్లి మెడికల్ కాలేజ్ హాస్టల్ దగ్గర ఆమెను వదిలిపెట్టి వెళ్లారు.

Sentenced life imprisonment for three convicts who gang rape case

మరుసటి రోజు బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో మణిపాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. యోగేష్, ఆనంద్, హరిప్రసాద్, బాలచంద్ర, హరీంద్ర అనే ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో యోగేష్, ఆనంద్, హరిప్రసాద్ ప్రధాన నిందితులు అని వెలుగు చూసింది.

కేసు విచారణ చేసిన ఉడిపి జిల్లా న్యాయస్థానం హరిప్రసాద్, ఆనంద్, యోగేష్ లకు యావజ్జీవ శిక్ష, రూ. 1.10 లక్షల అపరాధ రుసుం విధించింది. సాక్ష్యాలు నాశనం చేశారని బాలచంద్ర, హరీంద్ర అనే ఇద్దరికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. ఐదు వేలు జరిమానా విధించింది. మెడిసిన్ విద్యార్థిని గ్యాంగ్ రేప్ జరిగిన సమయంలో కర్ణాటకలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+