కేజ్రీవాల్‌కు భారీ షాక్
మరో ఐదు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని శ్రమిస్తున్న తరుణంలో ఏకంగా ఏడుగురు ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీలో తమ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అరవింద్ కేజ్రీవాల్ పైనా, ఆప్ పార్టీపైనా విశ్వాసం కోల్పోయినట్లు ఎమ్మెల్యేలు భావనా గౌర్, మదన్ లాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు రాజీనామా లేఖలు పంపారు. మీ పట్ల, పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయానని.. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన లేఖలో భావనా గౌర్ పేర్కొన్నారు. దయచేసి తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.

త్రిలోక్‌పురి ఎమ్మెల్యే రోహిత్ మెహ్రౌలియా, జనక్‌పురి ఎమ్మెల్యే రాజేశ్ రిషి, కస్తూర్బానగర్ ఎమ్మెల్యే మదన్ లాల్, మెహ్రౌలి ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ తోపాటు ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ, బిజ్వాసన్ ఎమ్మెల్యే బీఎస్ జూన్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. అయితే, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు ఈసారి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం గమనార్హం. ఈ క్రమంలో వీరంతా ఆప్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేకపోలేదు. దీంతో ఆ పార్టీకి భారీ నష్టమే కలిగించే అవకాశం ఉంది.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి అధికారం దక్కించుకునేందుకు బీజేపీ అగ్రనేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోడీతోపాటు కేంద్రమంత్రులు, రాష్ట్ర నేతలు ప్రజల వద్దకు వెళ్లి ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనుండగా.. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి. మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా శ్రమిస్తుండగా.. ఈసారి దేశ రాజధానిలో జెండా ఎగురేయాలని బీజేపీ కూడా ఉధృతంగా ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ కూడా బరిలో ఉన్నప్పటికీ.. ఆప్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications