రెడ్‌లైట్ ఏరియాపై దాడి: తెలుగు గర్ల్స్‌కు విముక్తి

కర్ణాటక రాష్ట్రంలో అదృశ్యమైన అమ్మాయిల విషయమై ఢిల్లీలోని కమ్లా పోలీస్ స్టేషన్‌లో ఆ రాష్ట్రానికి చెందిన ఎన్జిఓ సంస్థ స్టాప్(ఎన్జిఓ ఎస్‌టిఓపి) రాష్ట్ర పోలీసులతో కలిసి సంప్రదించింది. దీంతో కర్ణాటక పోలీసులతో కలిసి దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు బాధితుల ఆచూకీని తెలసుకున్నారు. కర్ణాటకలోని గౌరిబిద్నూరుకు చెందిన ఆ అమ్మాయిలు ఇక్కడి వ్యభిచారం గృహంలో ఉన్నట్లు గుర్తించామని డిసిపి అలోక్ కుమార్ తెలిపారు.
అంతేగాక ఇక్కడ మరికొందరు అమ్మాయిలను కూడా బలవంతంగా వ్యభిచారం కూపంలోకి దింపుతున్నట్లు తెలిసిందని చెప్పారు. వ్యభిచార గృహంపై దాడి చేసి కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఐదుగురు అమ్మాయిలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు అమ్మాయిలను రక్షించినట్లు ఆయన తెలిపారు.
వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న యజమానిని అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలను ఢిల్లీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వ్యభిచార కూపంలోకి దించుతున్నట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications