కర్ణాటకలో విషాదం.. మూడు నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి
కర్ణాటక రాష్ట్రంలోని హోసకోట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చిత్తూరు జిల్లా నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో హోసకోట మండలంలోని గొట్టిపుర గేట్ వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు, వీరిలో నలుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన కేశవరెడ్డి (44), తులసి (21), ప్రణతి (4) మరియు మూడు నెలల చిన్నారి కూడా ఉన్నారు.

అలానే ఎస్‌ఆర్‌పురం మండలంలోని పుల్లూరు గ్రామానికి చెందిన తులసి (21) అనే బీటెక్ విద్యార్థిని కూడా ఉన్నట్టు గుర్తించారు. ఆమె చెందినవారు. ఈ ప్రమాదంలో మరో 16 మంది ప్రయాణికులు గాయపడగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
గాయపడినవారిని హోసకోటలోని సిలికాన్ సిటీ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. బస్సు డ్రైవర్ వేగంగా ఓవర్‌టేక్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ప్రమాదం వల్ల మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలముకుంది. అధికారులు బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications