వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ బాద్ షా షారుక్

|
Google Oneindia TeluguNews

ముంబై: కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ సారి చిత్ర పరిశ్రమకు కూడా తగిని ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నట్లు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అన్నారు. కేంద్రం ఫిబ్రవరి 28న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఆయన స్పందించారు. బాలీవుడ్‌కు కూడా ప్రయోజనం చేకూరే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

చిత్ర పరిశ్రమను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నట్లు షారుక్ ఖాన్ పేర్కొన్నారు. ఓ టీవీ షో నిర్వహిస్తున్న సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన పై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా షారుక్ మాట్లాడుతూ ‘అయినా, నేనో నటుడ్ని. బడ్జెట్ గురించి నన్నడగడం ఏంటి' అని అన్నారు.

Shah Rukh Khan hopes Union Budget 2015 will benefit film industry

తాను బడ్జెట్‌ను గౌరవిస్తానని, మన ఆర్థిక వ్యవస్థకు బడ్జెట్ ఎంతో కీలకమైనదని చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్ చిత్ర పరిశ్రమకు ఎంతోకొంత మేలు చేకూరుస్తుందని ఖచ్చితంగా చెప్పగలనని ఆయన తెలిపారు.

రేటింగ్ పద్ధతి మెరుగుపడిందని, దీంతో నిర్మాతలు, నటులు రాజీపడకుండా తమ పనులను చేస్తారని చెప్పారు.కాగా, ప్రస్తుతం షారుక్ ఖాన్ ‘మనీషా శర్మ' ‘ఫ్యాన్' ‘రీస్' చిత్రాల్లో నటిస్తున్నారు.

English summary
As Arun Jaitley is set to present the Union Budget on February 28, Bollywood superstar Shah Rukh Khan hopes that the film industry will be taken into consideration by the Finance Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X