బీజేపీ నేతకు చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్

న్యూఢిల్లీ: బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్‌కు శనివారం రాత్రి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. హుస్సేన్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పాట్నా నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోని.. అక్కడి నుంచి రాత్రి 11.30నిమిషాల సమయంలో ఇంటికి వెళుతుండగా దుబాయ్ నెంబర్ నుంచి రెండు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బీజేపీ అధికార ప్రతినిధిగా టీవీ చర్చాకార్యక్రమాల్లో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ మాట్లాడినందుకు తనను తిట్టారని.. పార్టీని విడిచిపెట్టాలని లేదంటే సమస్యలు ఎదుర్కొంటావని బెదిరించారని ఆయన వివరించారు. ప్రధాని మోడీ కూడా నిన్ను కాపాడలేరంటూ బెదిరించాడని పేర్కొన్నారు.

ఈ బెదిరింపు ఫోన్ కాల్స్‌‌ని సీరియస్‌గా తీసుకోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీనియర్ పోలీస్ ఆఫీసర్ వెల్లడించారు. పార్లమెంట్ వీధిలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.

జంతుచర్మాలు కాల్చివేత

ఇటీవల కాలంలో దాడుల్లో పట్టుబడిన జంతుచర్మాలను కేంద్ర పర్వావరణ - అడవుల మంత్రిత్వ శాఖ అధికారులు మంత్రి ప్రకాశ్ జవదేకర్ సమక్షంలో ఆదివారం ఢిల్లీలోని జంతు ప్రదర్శనశాలలో దగ్ధం చేశారు.

Shahnawaz Hussain gets threat calls from Dubai

పులి, చిరుత, పాము, జింక, ముంగిస వంటి జంతువుల చర్మాలు, ఏనుగు దంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. జంతువులు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పడానికే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+