సునంద పుష్కర్ కేసులో సాక్షాలు నాశనం చేశారు, సీబీఐతో: బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి !

సునంద పుష్కర్ మృతి కేసులో సాక్షాలు నాశనం చేశారు సునంద భర్త శశి థరూర్ అన్నీ అపద్దాలు చెప్పాడు విచారణ పేరుతో పోలీసులు ఆట్లాడుతున్నారు, స్వామి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శశి తరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో విచారణ సక్రమంగా జరగడం లేదని, అధికారులు విచారణ పేరుతో ఆట్లాడుతున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు.

కేసు విచారణ సవ్యంగా చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని చెప్పారు. సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ విచారణ చేస్తున్న అధికారులు ముందు అన్నీ అపద్దాలు చెప్పారని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు.

Shashi lied evidences tampered Sunanda death case: Subramanian Swamy

ఇప్పటికే సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో సాక్షాలు మొత్తం నాశనం చేసినా ఢిల్లీ పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఓ అనుమానాస్పద మృతి కేసు విచారణ చెయ్యడానికి ఢిల్లీ పోలీసులకు మూడు సంవత్సరాలు సమయం కావాలా అని సూటిగా ప్రశ్నించారు.

కేసు విచారణ అధికారులను తప్పించి మరో సీనియర్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సునంద పుష్కర్ కేసును విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అంతేకంటే సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసు సీబీఐకి అప్పగిస్తే ఇంకా మంచిదని రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+