వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్!: దుబాయ్‌లో శశిథరూర్, మెహర్ తరర్ ఫోటోలు లీక్...!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ దుబాయ్‌లో మూడు రోజుల పాటు పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరర్‌తో గడిపాడనే వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో సంచలనం చోటు చేసుకుంది.

శశిథరూర్, మెహర్ తరర్ దుబాయ్‌లో ఉన్నప్పటి ఫోటోలు అంటూ ప్రముఖ ఆంగ్ల వెబ్‌సైట్ జీ మీడియాలో వచ్చాయి. ఈ ఫోటోలు జూన్ 2013 దుబాయ్‌లో తీసినవిగా తెలుస్తోంది.

కాగా, పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరర్‌తో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ మూడు రాత్రుళ్లు గడిపారా? అంటే అవుననే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి విషయమై రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తోంది.

Shashi Tharoor, Mehr Tarar in Dubai

ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన ట్వీట్ చేశారు. థరూర్ మూడు రాత్రుళ్లు గడిపారని ఆయన ఆరోపించారు. థరూర్ దుబాయ్‌లో తరర్‌తో మూడు రోజులు ఉన్నాడని అంటున్నారు. తరర్‌తో థరూర్ సంబంధాలపై సునంద అప్‌సెట్ పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరర్‌తో తన భర్త శశిథరూర్ సంబంధాల పైన మృతి చెందిన సునంద పుష్కర్ అప్ సెట్ అయ్యారని అంటున్నారు.

పోలీసుల విచారణలో సాక్ష్యులు ఈ విషయం చెప్పారని తెలుస్తోంది. దుబాయ్‌లో థరూర్‌తో మూడు రోజులు ఉన్నారనే ప్రచారం పైన మెహర్ తరర్ కూడా స్పందించారు.

ఈ విషయమై తాను ఏమీ మాట్లాడదల్చుకోలేదని చెప్పారు. తనను పోలీసులు పిలిచి విచారిస్తే హాజరవుతానని చెప్పారు. అందుకోసం తాను నిరీక్షిస్తున్నానని తెలిపారు. తాను పోలీసుల విచారణకు సహకరించేందుకు సదా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దుబాయ్‌లో ఓ వేడుక కోసం తాను వెళ్లానని, తనతో పాటు చాలామంది వచ్చారని తెలిపారు.

ఫాస్ట్ ట్రాక్ కోర్టు కోసం

సునంద మృతి కేసులో ప్రత్యేక దర్యాఫ్తు బృందం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ కోసం కోరనుందని ఢిల్లీ పోలీస్ బాస్ మంగళవారం నాడు తెలిపారు. శశిథరూర్‌ను ప్రశ్నిస్తారా అని విలేకరులు అడిగితే... అవసరమైతే సిట్ ఆయనను ప్రశ్నిస్తుందని, ఈ కేసులో ఎవరినీ వదలరని చెప్పారు. సునంద మృతి నేపథ్యంలో శాంపిల్స్ ఎక్కడకు పంపించాలనే విషయం రెండు రోజుల్లో నిర్ణయిస్తామన్నారు. థరూర్ ఢిల్లీ వచ్చాడని తెలుసునని, అవసరమైతే అతనిని సిట్ ప్రశ్నిస్తుందన్నారు.

English summary
Shashi Tharoor and Pakistan Journalist Mehr Tarar in Dubai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X