వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శతృఘ్ను సిన్హా చురక, అహంకారం వీడు: మోడీపై రాహుల్ ఘాటుగా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించిన నేపథ్యంలో... ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సన్నిహితుడు, భారతీయ జనతా పార్టీ ఎంపీ శత్రఘ్ను సిన్హా తనదైన శైలిలో చురకలు అంటించారు. ఇది బీహార్ ప్రజల, ప్రజాస్వామ్య విజయం అని చెప్పారు.

బీహార్, బాహారీ అన్న విషయం ఈ ఎన్నికల ద్వారా తేటతెల్లమయిందని వ్యాఖ్యానించారు. బీహార్ ప్రజలు బీహారీ ఎవరో, బాహారీ ఎవరో తేల్చేశారని అని వ్యాఖ్యానించారు. కాగా, ఎన్నికల ప్రచారం సమయంలో ప్రధాని మోడీని నితీష్ బాహరీ (బయటి వ్యక్తి) అనగా... తాను బయటి వ్యక్తిని అయితే సోనియా మాటేమిటని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ స్పందన

ఇది విభజిత రాజకీయాల పైన ఏకత్వం సాధించిన అద్భుతమైన గెలుపు అని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. ఇది విద్వేషం మీద ప్రేమ, అహంకారం పైన వినయం సాధించిన విజయమన్నారు. అంతిమంగా బీహార్ ప్రజలు సాధించిన విజయమని చెప్పారు.

ఎనిమిది జిల్లాల్లో ఒక్కచోటా ఆధిక్యంలో లేని బిజెపి

బిహార్‌ ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి దూసుకుపోయింది. అన్ని జిల్లాల్లోనూ ఎన్డీయే కూటమిపై ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్డీయే కూటమి ఎనిమిది జిల్లాల్లో ఏ ఒక్క స్థానంలోనూ ఆధిక్యంలో లేకుండా పోయింది. భాగల్పూర్‌, దర్బంగా, కోసి, మగధ్‌, ముంగేర్‌, పట్నా, పూర్ణియా, సరణ్‌ ప్రాంతాలో జేడీయూ సంపూర్ణ ఆధిక్యంలో ఉంది. తిరుహుత్‌ ప్రాంతంలో బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది.

సిద్ధరామయ్య అభినందనలు

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యంలో దూసుకెళుతున్న నితీశ్ కుమార్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌లకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభినందనలు తెలిపారు. ఈ విజయానికి కారణం కాంగ్రెస్‌ నేతలు సోనియా, రాహుల్‌ గాంధీలేనంటూ కొనియాడారు.

మోడీ అహంకారం వీడు: రాహుల్ సంచలన వ్యాఖ్య

బీహార్ ప్రజలు బిజెపికి గుణపాఠం చెప్పారన్నారు. ఇకనైనా ప్రధాని మోడీ తన అహంకారం తగ్గించుకోవాలన్నారు. బిజెపి అసహనానికి, గర్వానికి ఈ ఫలితాలు బుద్ధి చెప్పే విధంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. హిందూ - ముస్లీం విభజన రాజకీయాలు ఇకనైనా ఆపేయాలన్నారు.

ఈ ఫలితాలు ప్రధాని మోడీకి, బిజెపికి ఓ గుణపాఠం అన్నారు. బీహార్లో నితీష్ కుమార్‌కు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వంలో చేరడంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రధాని మోడీ
మాటలు ఆపి ఇకనైనా పనులు చేయాలన్నారు. విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలన్నారు.

English summary
BJP MP Shatrughan Sinha praises CM Nitish Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X