ట్విస్ట్: జైల్లో బ్రిటన్ బృందం కల్సింది, ఇంద్రాణి ట్రంప్ కార్డ్ ఉపయోగిస్తుందా?
ముంబై: కూతురు షీనా బోరాను హత్య చేసిన కేసులో, తల్లి ఇంద్రాణి ముఖర్జీయా జైలు జీవితం గడుపుతోంది. అయితే, సోమవారం నాటి సంఘటన షీనా హత్య కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
దీంతో, ఇంద్రాణీ షీనా హత్య కేసు నుంచి తాత్కాలికంగా తప్పించుకుంటాందా? అనే ఆసక్తికర చర్చ సాగుతోంది. అందుకు బ్రిటిష్‌కు చెందిన బృందం ఆమెను జైలులో కలుసుకోవడమే!
షీనా హత్య కేసులో ఇంద్రాణి రిమాండులో ఉంది. ఆమెను బ్రిటన్ బృందం సోమవారం నాడు జైలులో కలిసింది. కొంతకాలంగా బ్రిటీష్ పౌరసత్వం కలిగి వున్న ఆమెకు జైల్లో అందుతున్న సహాయ సహకారాలు, వసతులు గురించి అడిగి తెలుసుకునేందుకు ఆ దేశానికి చెందిన బృందం ఇంద్రాణిని కలిసినట్లుగా తెలుస్తోంది.

అంతకుముందు జైల్లో ఆమెను కలిసేందుకు ముంబైలోని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషన్ బృందానికి అనుమతి ఇవ్వలేదు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని జైలు అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో ఢిల్లీలోని బ్రిటీష్ హైకమిషన్ అధికారులను ముంబై బృందం సంప్రదించడంతో ఇంద్రాణిని కలిసేందుకు అవకాశం లభించింది. షీనా కేసులో ఇంద్రాణికి బ్రిటన్ బృందం న్యాయ సహాయం చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆమె బ్రిటిషన్ జాతీయురాలు అనే ట్రంప్ కార్డును ఉపయోగించి.. తప్పించుకునే ప్రయత్నాలు చేయవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications