షీనాకు ఇంద్రాణి బెదిరింపు, ఆ ఫోన్ చేసింది ఫ్రెండ్ భర్త!
ముంబై: షీనా బోరా హత్య కేసులో మరో విషయాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులకు ఫోన్ చేసిన ఆ అదృశ్య వ్యక్తిని గుర్తించారని తెలుస్తోంది. షీనా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జియా ప్రధాన నిందితురాలు. కొద్ది రోజుల క్రితం ముంబై కమిషనర్‌కు అదృశ్య వ్యక్తి ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు.
దీంతో, ఈ సంచలనం వెలుగు చూసింది. అయితే, ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించారని తెలుస్తోంది. సమాచారం మేరకు... షీనా క్లోజ్ ఫ్రెండ్ యొక్క భర్త ఈ సమాచారం అందించాడని తెలుస్తోంది.
2011లో స్నేహితురాలి పెళ్లికి షీనా
2011లో షీనా తన స్నేహితురాలి పెళ్లికి వెళ్లింది. సమాచారం మేరకు.. వారు యూపిలోని మీరట్‌కు చెందిన వారు. ఆ తర్వాత వారు ముంబై వెళ్లి షీనాతో కలిసి కొద్ది రోజులు ఉన్నారు.
వారి ముంబై పర్యటనలో షీనాకు గురించిన ఆసక్తికర విషయాలు వారికి తెలిశాయి. ఆమె వ్యక్తిగత జీవితంలోని రహస్యాలు కూడా తెలిశాయి. కొద్ది రోజుల తర్వాత షీనాతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో, షీనా స్నేహితురాలు, భర్తకు అనుమానం వచ్చింది.
ఆ తర్వాత వారు షీనా తల్లి ఇంద్రాణిని కలిసి షీనా గురించి అడిగారు. ఇంద్రాణి వారిని బెదిరించింది. దీంతో, వారు షీనా బాయ్ ఫ్రెండ్ రాహుల్ ముఖర్జీయాను కలిసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత వారు ముంబై పోలీసులకు ఫోన్ చేయాలని నిర్ణయించారు.

ఆర్మ్డ్ ఫోర్స్‌లో పని చేస్తున్న షీనా ఫ్రెండ్ భర్త
ముంబై పోలీసులకు సమాచారం అందించిన షీనా భర్త ఫ్రెండ్ ఆర్మ్డ్ ఫోర్స్‌లో పని చేస్తున్నారని తెలుస్తోంది. షీనా 2012లో అదృశ్యం కాగా.. మూడేళ్ల తర్వాత తాజాగా.. ఆమెను తల్లి ఇంద్రాణి చంపినట్లుగా తేలిన విషయం తెలిసిందే.
షీనాకు ఇంద్రాణి బెదిరింపు
షీనాకు తల్లి ఇంద్రాణి బెదిరింపు మెయిల్స్ చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. తన పర్సనల్ మెయిల్ నుంచి షీనాకు బెదిరింపు మెయిల్స్ చేసింది. ఏప్రిల్ 24న షీనా హత్య జరిగింది. అంతకుముందు మార్చి 8న ఆమె బెదిరింపు మెయిల్స్ పంపించింది.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications