రాజ్‌నాథ్‌తో షీలా దీక్షిత్ భేటీ: రాజీనామా చేస్తారా?

న్యూఢిల్లీ: కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఆమె రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకున్నారు. రాజీనామా చేయడానికి సిద్ధపడే ఆమె రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకున్నట్లు ప్రచారం సాగింది. అయితే, ఆ ప్రచారాన్ని షీలా దీక్షిత్ ఖండించారు.

తాను రాజీనామా చేస్తాననేది పుకారు మాత్రమేనని, వాస్తవం వెలుగు చూసేవరకు ఊహాగానాలకు అవకాశం ఇద్దామని ఆమె అన్నారు. రాష్ట్రపతిని కలుస్తారా అని అడిగితే - ఎల్లవేళలా రాష్ట్రపతిని కలుస్తానని, రాష్ట్రపతిని కలుసుకోవడం తన బాధ్యత అని ఆమె అన్ారు.

Sheila Dikshit meets Home Minister, denies reports about resigning

రాష్ట్రపతిని కలిసి షీలా దీక్షిత్ తన గవర్నర్ పదవికి రాజీనామా చేస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాజ్‌నాథ్ సింగ్‌తో ఆమె 15 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాను కేరళ గవర్నర్‌గా కొనసాగే విషయంపై మాట్లాడినట్లు సమాచారం.

గత యుపిఎ ప్రభుత్వం ఆమెను కేరళ గవర్నర్‌గా నియమించింది. యుపిఎ ప్రభుత్వ హయాంలో నియమితులైన పలువురు గవర్నర్ల స్థానంలో ఎన్డియె ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించింది. ఆదివారంనాడు మహారాష్ట్ర గవర్నర్ కె. శంకరనారాయణన్ కూడా రాజీనామా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+