అయ్యో.. ఫుట్ బాల్ ఆడుతూ ఎంపీ మృతి
మేఘాలయ రాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం నెలకొంది. షిల్లాంగ్ కు చెందిన లోక్‌సభ ఎంపీ, 'వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ' (VPP) కీలక నేత రికీ ఆండ్రూ జె. సింగ్కాన్ మృతి చెందారు. ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయి ఆయన హఠాన్మరణం చెందారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
షిల్లాంగ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సింగ్కాన్.. షిల్లాంగ్ సమీపంలోని మావ్లై మావియోంగ్ లోని ఓ గ్రౌండ్ లో స్నేహితులతో ఫుట్ బాల్ ఆడటానికి వెళ్లారు. మ్యాచ్ జరుగుతుండగా ఆకస్మాత్తుగా మైదానంలో కుప్పకూలిపోయారు. అయితే వెంటనే అతన్ని వైద్య సహాయం కోసం మావియోంగ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. అయితే రాత్రి 8 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో షిల్లాంగ్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి రికీ ఆండ్రూ జె సింగ్కాన్ భారీ విజయం సాధించారు. మరోవైపు సింగ్కాన్ మృతి పట్ల మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications