Shilpa Shetty: అమ్మాకూతురికి నోటీసులు జారీ, ఆ కేసులో పోలీసులు షాక్, రాజ్ కుంద్రా దెబ్బతో !

ముంబాయి/లక్నో: ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి మరోసారి సినిమా కష్టాలు ఎదురైనాయి. ఇప్పటికే పోర్న్ ర్యాకెట్ కేసులో అరెస్టు అయ్యి జైల్లో ఉన్న భర్త రాజ్ కుంద్రాను ఎలాగైనా బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న ప్రముఖ నటి శిల్పాశెట్టికి, ఆమె తల్లి సునందా శెట్టిని విచారణ చెయ్యడానికి మరో రాష్ట్రానికి చెందిన పోలీసులు నోటీసులు జారీ చేశారు. శిల్పాశెట్టి, సునందా శెట్టికి నోటీసులు ఇచ్చిన ఉత్తరప్రదేశ్ పోలీసులు ముంబాయి చేరుకుని అక్కడే మకాం వెయ్యడంతో ఏ నిమిషంలో అయినా విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కోట్ల రూపాయల చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాశెట్టి, సునందా శెట్టిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చెయ్యకుండా వారిని కాపాడాలని శిల్పాశెట్టి న్యాయవాదులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

ఫిట్నెస్ సెంటర్ పేరుతో వ్యాపారం

ఫిట్నెస్ సెంటర్ పేరుతో వ్యాపారం

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తమిళ, తెలుగు, కన్నడ బాషలతో పాటు అనేక చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. శిల్పాశెట్టి సినీనటి కావడంతో ఆమె వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టారు. శిల్పాశెట్టి లోసిస్ వెల్నెస్ సెంటర్ అనే పేరుతో ఫిట్నెస్ చైన్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. శిల్పాశెట్టి ఈ కంపెనీలకు చైర్మన్ కాగా, ఆ ఫిట్నెస్ సెంటర్ల కంపెనీకి ఆమె తల్లి సునందా శెట్టి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

కోట్ల రూపాయలు వసూలు చేశారని ?

కోట్ల రూపాయలు వసూలు చేశారని ?

శిల్పాశెట్టి లోసిస్ వెల్నెస్ సెంటర్ అనే పేరుతో ఫిట్నెస్ చైన్ సెంటర్ల పేరుతో ఉత్తరప్రదేశ్ లో కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఫిట్నెస్ సెంటర్ల బ్రాంచ్ లు ప్రారంభిస్తామని డబ్బులు వసూలు చేసి ఇంత వరకు ఫిట్నెస్ సెంటర్లు ప్రారంభించకుండా మోసం చేశారని ఆరోపిస్తూ ఒమ్యాక్స్ హాట్స్ నివాసి జోస్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అమ్మా, కూతురికి నోటీసులు

అమ్మా, కూతురికి నోటీసులు


శిల్పాశెట్టి, ఆమె తల్లి సునందా శెట్టి మీద చీటింగ్ కేసులు నమోదు చేసిన ఉత్తరప్రదేశ్ లోని హజరత్ గంజ్ పోలీసులు, విభూతి ఖాండ్ పోలీసులు ముంబాయి చేరుకుని అమ్మా, కూతురికి నోటీసులు జారీ చేశారు. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె తల్లి సునందా శెట్టిని విచారణ చెయ్యడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు ముంబాయిలొనే మకాం వేశారు.

 విచారణ చేస్తున్నాము: డీసీపీ

విచారణ చేస్తున్నాము: డీసీపీ

శిల్పాశెట్టి, ఆమె తల్లి సునందా శెట్టి మీద చీటింగ్ కేసులు నమోదు చేసి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, వారిద్దరిని విచారణ చేసిన తరువాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని విచారణ అధికారి డీసీపీ సంజీవ్ సుమన్ స్థానిక మీడియాకు చెప్పారు. ఇప్పటికే ఫోర్న్ రాకెట్ కేసులో అరెస్టు అయిన రాజ్ కుంద్రా జైలుపాలు కావడంతో ఇప్పుడు ఆయన భార్య శిల్పాశెట్టి, ఆమె తల్లి సునందా శెట్టికి సినిమా కష్టాలు ఎదరైనాయని వారి సన్నిహితులు అంటున్నారు.

 ఏమైనా జరగచ్చు, లాయర్లు ఏం చేస్తున్నారంటే ?

ఏమైనా జరగచ్చు, లాయర్లు ఏం చేస్తున్నారంటే ?

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి, ఆమె తల్లి సునందా శెట్టిని విచారణ చెయ్యడానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీసులు నోటీసులు జారీ చేశారు. శిల్పాశెట్టి, సునందా శెట్టికి నోటీసులు ఇచ్చిన ఉత్తరప్రదేశ్ పోలీసులు ముంబాయి చేరుకుని అక్కడే మకాం వెయ్యడంతో ఏ నిమిషంలో అయినా విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కోట్ల రూపాయల చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాశెట్టి, సునందా శెట్టిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చెయ్యకుండా వారిని కాపాడాలని శిల్పాశెట్టి న్యాయవాదులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+