వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిమ్లా గ్యాంగ్ రేప్ కేసు: ఐజీ, డీఎస్పీ సహా 8 మంది పోలీసులు కటకటాల్లోకి!

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లా జిల్లాలోని కోట్‌ఖైలో పాఠశాల విద్యార్థినిపై జూలై 4న జరిగిన అత్యాచారం, హత్య కేసులో సీబీఐ అధికారులు 8 మంది పోలీసులను అరెస్ట్ చేశారు. వీరిలో ఐజీ, డీఎస్పీ కూడా ఉన్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ సిమ్లా జిల్లాలోని కోట్‌ఖైలో పాఠశాల విద్యార్థినిపై జూలై 4న జరిగిన అత్యాచారం, హత్య కేసులో సీబీఐ అధికారులు 8 మంది పోలీసులను అరెస్ట్ చేశారు. వీరిలో ఐజీ, డీఎస్పీ కూడా ఉన్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు కస్టడీలో ఉండగానే మరణించడం (కస్టోడియల్ డెత్) తో వీరిని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. సీనియర్ ఐపీఎస్ అధికారి జహూర్ జైదీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ జోషీలను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

Shimla gangrape case - IG, DSP among 8 cops held for custodial death in Himachal

రేప్ కేసులో ప్రధాన నిందితుడైన నేపాల్ కార్మికుడు సూరజ్ సింగ్ కోట్‌ఖై పోలీస్ స్టేషన్‌ లాకప్‌లో జూలై 18న మృతి చెందాడు. మరో నిందితుడు రాజేందర్ సింగ్ ను తీవ్రంగా కొట్టి హత్య చేసినట్టు ఆరోపణలున్నాయి. బాలికపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో పోలీసులు ఆరుగురుని అదుపులోకి తీసుకోగా వారిలో రాజేందర్ సింగ్, సూరజ్ సింగ్ కూడా ఉన్నారు.

జూలై 4న బాలికపై అత్యాచారం జరగ్గా 6న తీవ్ర గాయాలతో అడవిలో పడి ఉన్న బాలికను గుర్తించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సిమ్లా వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. దీంతో కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి జహూర్ జైదీకి సారథ్య బాధ్యతలు అప్పగించింది.

ఈ కేసును సిట్‌కు బదిలీ చేయడానికి ముందు డీఎస్పీ మనోజ్ జోషి విచారించారు. కాగా, కస్టడీలో ఉన్న నిందితుడు చనిపోవడంతో సీబీఐ జైదీ, జోషీ సహా ఎనిమిది మందిని పోలీసులను మంగళవారం అరెస్ట్ చేసింది.

English summary
The CBI arrested eight Himachal Pradesh policemen, including an inspector general, on Tuesday for the custodial death of a key accused in the brutal rape and murder of a school girl in Kotkhai in Shimla district on July 4. The CBI's action in arresting a large number of cops, including senior IPS officer Zahoor Zaidi, for custodial death is a rare instance. Also arrested was deputy superintendent of police Manoj Joshi. The eight arrests, made on charges of custodial death, come at a time when the Kotkhai case has become a political issue ahead of assembly elections in the hill state. Many people have alleged that there was an attempt to shield the real culprits and that there was an attempt to destroy evidence as well. The state government and senior police officers have, however, denied all allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X