
Shiv Sena: ఉద్దవ్ ఠాక్రే వర్గం రిలాక్స్, స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు, అనర్హత వేటు భయంతో!
న్యూఢిల్లీ/ముంబాయి: మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపుతిరుగుతున్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వర్గంలోని శివసేన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యకూడదని, ఆ ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నావేర్కర్ కు సోమవారం సుప్రీం కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఏక్ నాథ్ షిండే వర్గంలోని శివసేన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పెండింగ్ లో ఉందని, ఆ పిటిషన్ విచారణ పూర్తి అయ్యే వరకు మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నావేర్కర్ మా మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా సూచించాలని ఉద్దవ్ ఠాక్రే వర్గంలోని శివసేన ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఏక్ నాథ్ షిండే వర్గం మీద వేటు వెయ్యాలని?
శివసేన పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేతో చేతులు కలిపి పార్టీకి ద్రోహం చేశారని, అందులోకి 16 మంది మీద అనర్హత వేటు వెయ్యాలని ఉద్దవ్ ఠాక్రే వర్గం అప్పటి మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కు మనవి చేసింది. అయితే అప్పట్లో ఏక్ నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఇంకా విచారనలోనే ఉంది.

రివర్స్ లో ఉద్దవ్ ఠాక్రే వర్గం మీద వేటు వెయ్యాలని!
మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, అసెంబ్లీలో ప్లోర్ టెస్ట్ లో విజయం సాధించడంతో ఆయన వర్గంలోని శివసేన ఎమ్మెల్యేలు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు ఉద్దవ్ ఠాక్రే వర్గంలోని శివసేన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలని ఏక్ నాథ్ షిండే వర్గంలోని కొందరు ఎమ్మెల్యేలు మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నావేర్కర్ కు మనవి చేశారు.

సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఉద్దవ్ ఠాక్రే వర్గం
తమ మీద స్పీకర్ రాహుల్ నావేర్కర్ అనర్హత వేటు వేస్తారని భయపడిన ఉద్దవ్ ఠాక్రే వర్గంలోని శివసేన ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ విచారణ జరిగింది. ఏక్ నాథ్ షిండే వర్గంలోని శివసేన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పెండింగ్ లో ఉందని, ఆ పిటిషన్ విచారణ పూర్తి అయ్యే వరకు మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నావేర్కర్ ఉద్దవ్ ఠాక్రే వర్గంలోని ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా సూచించాలని ఉద్దవ్ ఠాక్రే వర్గంలోని శివసేన ఎమ్మెల్యేల తరుపున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ సుప్రీం కోర్టుకు మనవి చేశారు.

మహారాష్ట్ర స్పీకర్ కు సుప్రీం కోర్టు ఆదేశాలు
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వర్గంలోని శివసేన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యకూడదని, ఆ ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నావేర్కర్ కు సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ. రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని బెంచ్ మహారాష్ట్ర స్పీకర్ కు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీం కోర్టు ఆదేశాలతో ఊపిరిపీల్చుకున్న ఉద్దవ్ ఠాక్రే వర్గం
మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే వర్గం ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదని సూచించాలని ఆ రాష్ట్ర గవర్నర్ తరపున వాదించడానికి కోర్టుకు హాజరై సాలిసిటిర్ జనరల్ తుషాకర్ మెహ్తాకు సుప్రీం కోర్టు సూచించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే వర్గంలోని శివసేన ఎమ్మెల్యేలు తాత్కాలికంగా ఊపిరిపీల్చుకున్నారు.