Shock: కూల్ డ్రింక్ లో మద్యం పోసి పిల్లలతో తాగించారు, అమ్మనా బూతులు తిట్టారు, వీడియో వైరల్ !

బెంగళూరు: పరిచయం ఉన్న యువకులు ఫామ్ హౌస్ లో మందు పార్టీ, మంసాహారంతో భోజనాలు చేశారు. ఫామ్ హౌస్ లో మా దగ్గర ఆడుకోవడానికి రావాలని పిల్లలను పిలుచుకుని వెళ్లి చికెన్ తో భోజనం పెట్టిన కిరాతకులు వాళ్లకు కూల్ డ్రింక్ లో మద్యం పోసి తాపించేశారు. మద్యం సేవించిన పిల్లలు వాళ్ల తల్లిదండ్రులను, తెలిసిన వాళ్లను, స్థానికంగా నివాసం ఉంటున్న వారిని అమ్మనా బూతులు తిట్టారు. మద్యం మత్తులో పిల్లలు బూతులు తిడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు వియషం బయటకు వచ్చింది.

ఫామ్ హౌస్ లో పార్టీ

ఫామ్ హౌస్ లో పార్టీ

బెంగళూరు గ్రామీణ జిల్లాలోని రామనగర జిల్లా, కనకపుర తాలుకా మరళిపుర గ్రామం సమీపంలోని ఫామ్ హౌస్ దగ్గర 10 రోజుల క్రితం స్థానికంగా నివాసం ఉంటున్న యువకులు మందు పార్టీ ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ అమలులో ఉండటంతో స్థానికంగా నివాసం ఉంటున్న యువకులు అందరూ ఆ మందు పార్టీకి వెళ్లారు.

కూల్ డ్రింక్ లో పిల్లలకు మద్యం తాగించేశారు

కూల్ డ్రింక్ లో పిల్లలకు మద్యం తాగించేశారు


తోటలో మందు పార్టీతో పాటు చికెన్ బిర్యానీ, మంసాహార భోజనాలు తయారు చేశారు. ఇదే సమయంలో గ్రామంలో నివాసం ఉంటున్న 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న 7 మంది పిల్లలను ఆడుకోవడానికి ఆ తోటలో పిలుచుకుని వెళ్లారు. ఆ సందర్బంలో గణేష్, కరియప్ప, సోమసుందర్ అనే ముగ్గురు యువకులు మద్యం సేవించారు. తరువాత కూల్ డ్రింగ్ లో మద్యం కలిపి పిల్లల దగ్గర తాగించారు.

అమ్మనా బూతులు తిట్టిన పిల్లలు

అమ్మనా బూతులు తిట్టిన పిల్లలు

మద్యం సేవించిన పిల్లలు మత్తులో వాళ్ల తల్లిదండ్రులను, తెలిసిన వాళ్లను, స్థానికంగా నివాసం ఉంటున్న వారిని అమ్మనా బూతులు తిట్టారు. ఓ పిల్లాడు నాకు ఇంకా మందు పోయ్యండి రా అంటూ ఓ బాలుడు రెచ్చిపోయాడు. మద్యం మత్తులో పిల్లలు బూతులు తిడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు వియషం బయటకు వచ్చింది.

కిరాతకుల తిక్కచేష్టలు

కిరాతకుల తిక్కచేష్టలు

ఈ విషయం రచ్చరచ్చ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పిల్లల దగ్గర మద్యం తాగించిన గణేష్, కరియప్ప అనే ఇద్దరిని అరెస్టు చేశామని, సోమశేఖర్ పరారైనాడని రామనగర జిల్లా ఎస్పీ ఎస్ గిరీష్ చెప్పారు. నిందితులపై కఠినమైన కేసులు పెట్టి జైల్లో పెట్టాలని ఆ పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+