Shock: నడిరోడ్డులో భార్యను నరికి చంపేసిన భర్త, సెంట్రల్ జైల్లో ఏం చేశాడంటే ?, రెండు రోజులకే !
బెంగళూరు/ధారవాడ: వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా జీవించారు. రానురాను దంపతుల మద్య గొడవలు జరిగాయి. చివరికి దంపతులు విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. భార్యకు సరైన బుద్ది చెప్పాలని భర్త చాలాకాలం నుంచి ఎదురు చూస్తున్నాడు. అయితే భార్య మాత్రం భర్తను ఏమాత్రం పట్టించుకోలేదు. జిల్లా ఆసుపత్రి దగ్గర ఉన్న భార్యను పట్టపగలు దారుణంగా హత్య చేసిన భర్త ఎస్కేప్ అయ్యాడు. భర్తను అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలుకు వెళ్లిన భర్త అదే సెంట్రల్ జైల్లో శవమై కనిపించడం కలకలం రేపింది.

దంపతుల హ్యాపీలైఫ్
కర్ణాటకలోని ధారవాడలో ఆనంద్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆనంద్ సవితా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న ఆనంద్, సవితా దంపతులు చాలా సంతోషంగా జీవించారు. రానురాను సవితా, ఆనంద్ దంపతుల మద్య గొడవలు జరిగాయి.

భార్యను చంపేయాలని డిసైడ్
గత ఏడాది ఆనంద్, సవితా దంపతులు విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. భార్య సవితాకు సరైన బుద్ది చెప్పాలని ఆనంద్ చాలాకాలం నుంచి ఎదురు చూస్తున్నాడు. అయితే సవితా మాత్రం ఆమె భర్త ఆనంద్ ను ఏమాత్రం పట్టించుకోలేదు. చివరికి సవితాను చంపేయాలని ఆమె భర్త ఆనంద్ డిసైడ్ అయిపోయాడు.

నడిరోడ్డులో భార్యను నరికి చంపేశాడు
గత నెల 14వ తేదీన సవితా ధావణగెరె జిల్లా ఆసుపత్రి దగ్గర వెలుతున్న సమయంలో ఆనంద్ ఆమెను అడ్డుకున్నాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన ఆనంద్ కొడవలి తీసుకుని అతని భార్య సవితాను పట్టపగలు దారుణంగా హత్య చేశాడు. భార్య సవితాను హత్య చేసిన ఆనంద్ దర్జగా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.

సెంట్రల్ జైల్లో ఆత్మహత్య
భార్య సవితాను హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న ఆనంద్ ను మూడు రోజుల క్రితమే పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాలతో ఆనంద్ ను ధారవాడ సెంట్రల్ జైలుకు పంపించారు. జైలుకు వెళ్లిన ఆనంద్ ధారవాడ సెంట్రల్ జైల్లో దుప్పటితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications