మణిరత్నం సినిమా చూడడానికి గర్ల్ ఫ్రెండ్ రాలేదని యువకుడి ఆత్మహత్య

కోయంబత్తూరు: మణిరత్నం సినిమా ఒ కదల్ కన్మణి (తెలుగులో ఓకే బంగారం) సినిమా చూడడానికి ప్రేయసి రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని జె. జయశంకర్‌గా గుర్తించారు.

జయశంకర్ కోయంబత్తూరులో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. గర్ల్ ఫ్రెండ్ అప్పారల్ కంపెనీలో పనిచేస్తుంది. మద్యం సేవించిన తర్వాత సినిమాకు రావాల్సిందిగా జయశంకర్ తన ప్రేయసిని ఫోన్‌లో కోరాడు.

 Shocking: Man commits suicide for Mani Rathnam's just released film 'O Kadhal Kanmani'

తాను రానని ప్రేయసి చెప్పడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. కొన్ని గంటల తర్వాత ఆమె జయశంకర్ ఇంటికి వెళ్లింది. తీరా ఆమె వెళ్లే సరికి అతని మృతదేహం సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

అమ్మాయి బోరున ఏడ్చేసి పోలీసులకు సమాచారం అందించింది. ఈ సంఘటన ఆదివారంనాడు జరిగినట్లు పీలమేడు పోలీసులు చెప్పారు. కాగా, అదే రోజు తనతో భర్త సినిమాకు రావడానికి నిరాకరించడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+