"దగ్గు మందు"పై షాకింగ్ రిపోర్ట్.. 11 మంది చిన్నారులు మృతికి కారణం అదే !
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వరుసగా చిన్నారుల మరణాలు చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేగింది. వివిధ ప్రాంతాల్లో పెద్దలకు వాడే దగ్గు సిరప్ తాగిన 11 మంది చిన్నారులు మరణించగా.. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ దుర్ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. అయితే పిల్లలకు ఇచ్చిన దగ్గుమందుపై ఔషధ నియంత్రణ సంస్థ చేపట్టిన పరీక్షల్లో షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
దగ్గుమందుపై ఇచ్చిన రిపోర్టులో ఎలాంటి కల్తీ ఆనవాళ్లు లభించలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు సాధారణంగా సరఫరా చేసే జనరిక్ దగ్గు సిరప్‌పై పరీక్షలు నిర్వహించామని వారు తెలిపారు. ఈ మేరకు మరణాలకు మరేదైనా కారణముందా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వివరించారు.

కాగా జైపూర్‌కు చెందిన కేసన్స్ అనే ఔషధ సంస్థ ఈ సిరప్‌ను తయారు చేస్తోంది. గత రెండేళ్లలో ఈ సిరప్‌కు నిర్వహించిన నాణ్యతా పరీక్షల్లో 40 నమూనాలు విఫలమైనట్లు అధికారులు గుర్తించారు. దీనితో ఈ సిరప్‌పై తాత్కాలిక నిషేధం విధించారు. కేసన్స్ ఇప్పటివరకు 660 బాటిళ్లను ఉత్పత్తి చేయగా, 594 బాటిళ్లను వివిధ దుకాణాలకు పంపిణీ చేసినట్లు సమాచారం. సంస్థ వద్ద మిగిలిన 66 బాటిల్ శాంపిల్స్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. దుకాణదారులు ఈ సిరప్ బాటిళ్లను విక్రయించవద్దని ఆదేశించారు.
కిడ్నీ సంబంధిత సమస్యలున్న పిల్లలు ఈ సిరప్ తీసుకోవడం వల్ల మరింత తీవ్రమైన ప్రభావం పడుతోందని అధికారులు గుర్తించారు. అయితే, ఈ సిరప్ సురక్షితమని నిరూపించడానికి దానిని తీసుకున్న భరత్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఒక వైద్యుడు కూడా అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications