మోడీ పై వారణాసి నుంచి పోటీ చేస్తా...ప్రియాంకా గాంధీ వ్యాఖ్యలు దేనికి సంకేతం..?
రాయ్ బరేలీ: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న అమేథీ, రాయ్‌బరేలీలో పర్యటించారు. అయోధ్యకు బయలు దేరి వెళ్లేముందు సొంత ఇంటిని చక్కబెట్టి వెళ్లారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రియాంకా గాంధీ తొలిసారిగా అమేథీ రాయ్ బరేలీలలో పర్యటించారు.

రాయ్ బరేలీలో పర్యటించిన ప్రియాంకా గాంధీ 2019 ఎన్నికలు సత్యానికి అసత్యానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అభివర్ణించారు. సోనియాగాంధీకి ఇక్కడి ప్రజలు ఘనవిజయం చేకూర్చాలని పిలుపునిచ్చారు. ఇదే నియోజకవర్గం నుంచి సోనియాగాంధీ ఐదవ సారి ఎంపీగా పోటీ చేస్తుండటం విశేషం. ఇక రాయ్‌బరేలీలో ఆమె ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు కార్యకర్తలు తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నినాదాలు చేశారు. ఇందుకు ప్రియాంకా గాంధీ ఒకవేళ పోటీచేయాల్సి వస్తే వారణాసి నుంచి పోటీ చేయమంటారా అని కార్యకర్తలనే ప్రశ్నించినప్పుడు వారి నుంచి మంచి స్పందన వచ్చింది.
అమేథీ రాయ్‌బరేలీ నియోజకవర్గాలకు సంబంధించి బూత్ లెవెల్ కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. వారిలో జోష్‌ను నింపారు. గతంలో కూడా సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు ఘనవిజయం సాధించేందుకు ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రియాంకా గాంధీ ఎన్నికలకు కొన్ని వారాలముందే వచ్చి ప్రచారం చేసి కార్యకర్తల్లో జోష్ నింపారు. ఇక కార్యకర్తలతో సమావేశమైన ప్రియాంకా గాంధీ న్యాయ్ పథకం గురించి ప్రతి ఇంటికి వెళ్లి కార్యకర్తలు విధిగా ప్రచారం చేయాలని వెల్లడించారు. కేవలం లోక్‌సభ ఎన్నికలకు మాత్రమే కాదు... 2022లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కూడా కార్యకర్తలు ఇప్పటి నుంచే శ్రమించాలని ప్రియాంకా గాంధీ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే శుక్రవారం ప్రియాంకా గాంధీ అయోధ్యలో పర్యటిస్తుంది. అక్కడ రోడ్ షోలతో పాటు బహిరంగ సభల్లో ఆమె పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత సాయంత్రం హునుమాన్ గర్హి ఆలయాన్ని ఆమె సందర్శిస్తారు.












Click it and Unblock the Notifications