సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ కు షాక్ ఇచ్చిన మాజీ సీఎం సిద్దూ, ఇంటికి వెళ్లి పిలిచినా !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సంకీర్ణ ప్రభుత్వం సమన్వయ కమిటి అధ్యక్షుడు సిద్దరామయ్య మరోసారి ఝలక్ ఇచ్చారు. సీఎం కుమారస్వామి కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వామి నామినేషన్ సమర్పించే సమయంలో తాను హాజరుకాలేనని సిద్దరామయ్య మీడియాకు చెప్పారు.
నిఖిల్ కుమారస్వామి తల్లి, రామనగర ఎమ్మెల్యే అనితా కుమారస్వామి తన ఇంటికి వచ్చి తన కుమారుడు మండ్య లోక్ సభ నియోజక వర్గం జేడీఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసే సమయంలో మీరు హాజరుకావాలని మనవి చేశారని సిద్దరామయ్య అన్నారు.

అయితే నిఖిల్ కుమారస్వామి నామినేషన్ సమర్పించే సమయంతో తాను హాజరుకాలేనని అనితా కుమారస్వామికి చెప్పానని సిద్దరామాయ్య అన్నారు. మార్చి 25వ తేదీ సోమవారం నిఖిల్ కుమారస్వామి మండ్య లోక్ సభ నియోజక వర్గంలో పోటీ చెయ్యడానికి నామినేషన్ వేస్తున్నారని సిద్దరామయ్య అన్నారు.
అదే రోజు తనకు మైసూరులో చాల కార్యక్రమాలు ఉన్నాయని, అక్కడి నుంచి చిత్రదుర్గకు వెలుతున్నానని, అందువలన నిఖిల్ కుమారస్వామి నామినేషన్ వేసే సమయంలో తాను హాజరుకాలేనని అనితా కుమారస్వామికి చెప్పానని సిద్దరామయ్య అన్నారు.
అదే రోజు కర్ణాటకలోని వివిద లోక్ సభ నియోజక వర్గాల్లో పోటీ చెయ్యడానికి నాయకులు నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్నారని, అన్ని కార్యక్రమాలకు తాను హాజరుకావడం సాధ్యం కాదని సిద్దరామయ్య చెప్పారు. తుమకూరు లోక్ సభ నియోజక వర్గం జేడీఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ నామినేషన్ వేస్తున్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. 20 లోక్ సభ నియోజక వర్గాల్లో కాంగ్రెస్, 8 లోక్ సభ నియోజక వర్గాల్లో జేడీఎస్ పార్టీలు పొటీ చేస్తున్నాయి.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications